English | Telugu

ఆగస్టు 30న `గ్యాంగ్ లీడ‌ర్` వ‌స్తున్నాడు!!

on May 17, 2019

నేచ‌ర‌ల్ స్టార్ నాని లేటెస్ట్ గా న‌టిస్తోన్న సినిమా `గ్యాంగ్ లీడ‌ర్`. విక్ర‌మ్ కె కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ నెల 14 నుంచి ఈ సినిమాకు సంబంధించిన మూడో షెడ్యూల్ శంషాబాద్ లో జ‌రుగుతోంది. జూన్ 30 వ‌ర‌కు షూటింగ్ కంప్లీట్ చేసి ఆగస్టు 30 న సినిమాను వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు చిత్ర నిర్మాత‌లు. ఇప్ప‌టి వ‌ర‌కు స్ర్కీన్ పై రాని ఓ డిఫ‌రెంట్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నాడు. అలాగే ఆర్ ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. జెర్సీ స‌క్సెస్ తో మాంచి ఊపు మీదున్న నాని ఈసినిమా త‌న కెరీర్ లో మ‌రో మ‌లుపుగా రాబోతుంద‌న్న కాన్ఫిడెంట్ తో ఉన్నాడు. ఈ చిత్రంలో ప్రియాంక‌, ల‌క్ష్మి, శ‌ర‌ణ్య‌, అనీష్ కురువిల్లా, ప్రియ‌ద‌ర్శి, ర‌ఘుబాబు, వెన్నెల కిషోర్, స‌త్య త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. 

 


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here