"సోదాపు.. దమ్ముంటే నన్నాపు".. సుధీర్‌బాబుకు నాని సవాల్!
on Feb 17, 2020
"ఏంట్రా గేమ్స్ ఆడుతున్నావా?".. "సోదాపు.. దమ్ముంటే నన్నాపు".. 'వి' మూవీ టీజర్లో సుధీర్‌బాబు, నాని మధ్య సంభాషణ ఇది. నాని 25వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీని మోహనకృష్ణ ఇంద్రగంటి డైరెక్ట్ చేస్తున్నాడు. నానితో ఆయనకు ఇది మూడో సినిమా. ఇదివరకు ఆ ఇద్దరి కాంబినేషన్లో 'అష్టా చమ్మా', 'జెంటిల్‌మేన్' సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ రెండూ ప్రేక్షకుల్ని అలరించాయి. అలాగే సుధీర్‌బాబుతో 'సమ్మోహనం' తర్వాత మోహనకృష్ణ చేస్తోన్న సినిమా ఇది. నాని విలన్‌గా కనిపించడం ఈ మూవీకి సంబంధించిన విశేషం. అంటే 'అష్టా చమ్మా'తో నానిని హీరోగా పరిచయం చేసిన మోహనకృష్ణ అతడిని విలన్‌గానూ పరిచయం చేస్తున్నాడన్న మాట. 'వి' అనే టైటిల్ కూడా 'విలన్'ని రిప్రజెంట్ చేస్తోంది.
సోమవారం సాయంత్రం రిలీజ్ చేసిన 'వి' టీజర్‌ని బట్టి నాని ఇందులో ఒక కిల్లర్‌గా కనిపిస్తాడని తెలుస్తోంది. అతడు హత్యలు చేస్తుంటాడనీ, ఆ మర్డర్ మిస్టరీని ఛేదించడానికి పోలీసాఫీసర్‌గా సుధీర్‌బాబు రంగంలోకి దిగుతాడనీ మనకు అర్థమవుతోంది. సినిమాలో ఇద్దరు హీరోయిన్లు.. నివేదా థామస్, అదితిరావ్ హైదరి ఉన్నారు. టీజర్లో ఒక్క నివేదా మాత్రమే కనిపించింది. 'జెంటిల్‌మేన్' తర్వాత నాని, నివేదా మరోసారి ఈ మూవీలో జంటగా కనిపించనున్నారు. "యు ఆర్ సైకో.. యు నో దట్?" అంటూ నివేదా చెప్పే డైలాగ్ నానిని ఉద్దేశించేనని మనం ఊహించవచ్చు.
ఈ టీజర్లో సుధీర్, నాని క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉంటాయో కూడా డైరెక్టర్ మనకు చెప్పేశాడు. "ఫూల్స్ మాత్రమే రూల్స్ గుడ్డిగా ఫాలో అవుతారు సార్. అప్పుడప్పుడు నాలాంటోడు కొద్దికొద్దిగా రూల్స్ బ్రేక్ చేస్తుంటాడంతే" అని సుధీర్ చెప్పే డైలాగ్ అతని క్యారెక్టర్ తీరు ఎలాంటిదో తెలియజేస్తోంది. దానికి తగ్గట్లే అతను యమ ఎనర్జీతో ఫైట్లు చేస్తూ కనిపిస్తున్నాడు.
"నో ఎవిడెన్స్ సార్. సూపర్ క్లీన్ జాబ్. చాలా హై ఎండ్ కిల్లర్ సార్" అని నాని గురించి ఒక పాత్ర చెప్తోంది. దాన్ని బట్టి అతడు ఎలాంటి కిల్లరో మనకు తెలుస్తోంది. ఆ మాటలు వచ్చేటప్పుడు ఒకరి చేతిని మధ్యలో కత్తితో కోసేయడం, మెడకోసి ఒక శవపేటికలో బాడీని పెట్టడం వంటివి చూపించారు. "ఎలా ఉంటాడు ఆ మనిషి?" అని సుధీర్ ఎవరినో అడుగుతుంటే, నాని పోలీస్ కానిసేబుల్ వేషంలో వచ్చి తను అనుకున్న పనిచెయ్యడం మనకు కనిపిస్తుంది. మొత్తానికి ఒక సందర్భంలో కనిపించిన నానిని పట్టుకోడానికి సుధీర్ ప్రయత్నించాడు. నాని దొరికాడా, లేదా? చివరకు ఏమైంది? అసలు నాని చేసి మర్డర్స్ వెనుక ఏమైనా కథ ఉన్నదా? టీజర్ చెబుతున్నది కాకుండా కథలో వేరే ఏమైనా ట్విస్ట్ ఉన్నదా? అదితిరావ్ హైదరి క్యారెక్టర్ ఏమిటి? అనే విషయాలు ఆసక్తి రేపుతున్నాయ్.
దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ మూవీని ఉగాది సందర్భంగా మార్చి 25న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Also Read