బ్రహ్మోత్సవం ఫ్లాప్ నితిన్ కు ప్లస్ అయింది..!
on May 21, 2016
నితిన్, సమంతల కాంబినేషన్లో, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన సినిమా అ..ఆ. సినిమా రిలీజ్ చేయడానికి ఈ మూవీ యూనిట్ కు గ్యాప్ దొరకలేదు. సినిమా ఎప్పుడో ఫినిష్ చేసుకుని కూర్చున్న త్రివిక్రమ్ కు ఇప్పుడు పెద్ద రిలీఫ్ బ్రహ్మోత్సవం రిలీజ్ ద్వారా వచ్చేసింది. నిజానికి మే 6 న సినిమాను విడుదల చేద్దామనుకున్నారు. ఆ రోజున సూర్య సినిమా వచ్చి దెబ్బ కొట్టింది. సరే పోనీ 20 న వద్దాంలే అనుకుంటే సూపర్ స్టార్ ఖర్చీఫ్ వేసేశాడు. దీంతో ఇక చేసేది లేక జూన్ 2 కు సినిమా డేట్ ను ఫైనల్ చేసుకున్నారు. సినిమా బిజినెస్ కు చాలా కీలకమైన వేసవి సీజనంతా పోయిందనే బాధ మూవీ టీంలో ఉంది. అయితే నిన్న రిలీజైన బ్రహ్మోత్సవం, పూర్తిగా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడం నితిన్ అండ్ కో కు ప్లస్ అయింది. హిట్ అయితే, రెండు వారాల పాటు ప్రభంజనం ఉంటుందని భయపడి మూవీ జూన్ 2 వరకూ గెంటేశారు. అయితే మహేష్ సినిమాకు ఉన్న టాక్ చూస్తే వారం రోజులు నిలవడం కూడా కష్టంగానే కనిపిస్తోంది. ఈ రిజల్ట్ మీద కాన్ఫిడెన్స్ తో సినిమాను ఒక వారం ముందే రిలీజ్ చేసినా ఆశ్చర్యం లేదు. ఒక సినిమా బాలేదని టాక్ వచ్చినప్పుడు, దాన్నుంచి ఆల్టర్నేటివ్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తారు. అలా వచ్చిన ఆల్టర్నేటివ్ యావరేజ్ గా ఉన్నా హిట్ చేసేస్తుంటారు. ఈ విషయం త్రివిక్రమ్ కు తెలియంది కాదు. అందుకే వచ్చే వారమే బరిలోకి దిగిపోదామా అన్న ఆలోచనలో ఉన్నాడట. ఒకవేళ జూన్ 2 నే రిలీజ్ చేసుకున్నా, అ..ఆ కు ఎలాంటి బెంగా లేదు.
Also Read