కామెడీకి కోచింగ్ ఇస్తున్న బాలీవుడ్ హీరో..!
on May 21, 2016

ఆ బాలీవుడ్ హీరో యాక్షన్ తో పాటు కామెడీ కూడా బాగా పండిస్తాడు. సంట్స్ చేయడమే కాదు, కితకితలు కూడా పెడతాడు. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ నటనకు రెండు వైపులా పదునే. ప్రస్తుతం ఈయన కామెడీ కోసం కోచింగ్ ఇస్తున్నాడట. కానీ అందరికీ కాదు లెండి. అక్షయ్ నటించిన కామెడీ సినిమా హౌస్ ఫుల్ 3 లో అక్షయ్ సరసన జాక్వలైన్ యాక్ట్ చేసింది. ఆ అమ్మడి కోసం యాక్షన్ స్టార్ కాస్తా కామెడీ మాస్టారు గా మారిపోయాడట. సినిమాలో కామెడీ టైమింగ్ ఎలా ఉండాలో సలహాలు సూచనలు అక్కీ దగ్గరే నేను తీసుకున్నానంటూ క్లియర్ గా చెబుతోంది జాక్వలైన్. ఆయనే నాకు ట్రైనర్. కామెడీ కోచ్. ఆయన పక్కన ఉండటం వలనే కామెడీ ఎలా చేయాలో నేర్చుకున్నాను. సినిమాలో నేను ఏమైనా నవ్వించగలిగానంటే అది ఆయన వల్లే అంటూ అక్షయ్ ను ఆకాశానికెత్తేస్తోంది శ్రీలంక భామ. హౌస్ ఫుల్ సీరీస్ లో వచ్చిన రెండు సినిమాలు ఇప్పటికే సూపర్ హిట్స్ అయ్యాయి. కామెడీ ప్రధానంగా సాగే ఈ సినిమాల్లో మూడో సినిమా హౌస్ ఫుల్ 3 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



