హాలీవుడ్ డైరెక్టర్ కు గిఫ్ట్ ఇచ్చిన హీరోయిన్..!
on May 21, 2016

హాలీవుడ్ డైరెక్టర్ డి.జే.కరుసో కు మంచి భారతీయ బహుమతి లభించింది. అద్భుతంగా ఎంబ్రాయిడ్ చేసిన కుర్తా, పైజమా, వాటితో పాటు మ్యాచింగ్ కలర్ షూస్ ఆయనకు గిఫ్ట్ గా వచ్చాయి. వీటిని మన హీరోయినే అతనికి గిఫ్ట్ గా ఇచ్చింది. విషయంలోకి వెళ్తే, దీపిక పదుకునే హాలీవుడ్ లో ట్రిపుల్ ఎక్స్ అనే మూవీలో చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తనను ఆ సినిమాకు తీసుకున్నందుకు కృతజ్ఞతగా ఆ సినిమా దర్శకుడు డిజే కరుసో కు ఇండియన్ ట్రెడిషనల్ డ్రెస్ ను గిఫ్ట్ గా ఇచ్చింది దీపిక. ఆ డ్రస్సు ఫోటోను తన ట్విట్టర్లో పెట్టి, ఈ డ్రస్ తో నేను స్టైల్ గా తయారవ్వాలి అంటూ ట్వీట్ చేశారు డైరెక్టర్ కరుసో. సినిమా విషయానికొస్తే, విన్ డీజిల్ హీరోగా వచ్చిన ట్రిపుల్ ఎక్స్ సీరీస్ హాలీవుడ్ లో బాగా ఫ్యామస్ అయింది. దీపిక చేస్తున్న సినిమా, సీరీస్ లో మూడోది కావడం విశేషం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



