కొడుక్కి రాజమౌళి పేరు పెట్టుకున్నాడు..!
on Jun 6, 2016
మర్యాదరామన్నలో బైరెడ్డి పాత్రతో అందరి కళ్లలో పడ్డాడు ప్రభాకర్. అయితే అతనికి అసలు పేరు తీసుకొచ్చింది మాత్రం బాహుబలిలోని కాలకేయ పాత్రే. తర్వాతి నుంచి అతన్ని అందరూ కిలికిలి ప్రభాకర్ అని, కాలకేయ ప్రభాకర్ అని పిలవడం మొదలెట్టారు. ఇప్పుడు తనకున్న ప్రతీ అవకాశం రాజమౌళి కారణంగా వచ్చిందే అంటూ చెబుతున్నాడు. మగధీర సినిమాలో శ్రీహరి వెనక వందమందిలో ఒకడిగా చేసిన ప్రభాకర్ కు, ఆ తర్వాత చేసిన మర్యాద రామన్న మంచి పేరు తీసుకొచ్చింది. లేటెస్ట్ గా బాహుబలిలో రాజమౌళి ఇచ్చిన కాలకేయ పాత్ర అయితే, ఇండస్ట్రీలో అతనికి మంచి స్థానాన్ని ఏర్పరిచింది. " నాకు ఇండస్ట్రీ అన్నీ ఇచ్చింది. ఇదంతా రాజమౌళి గారి వల్లే. నా తల్లిదండ్రులు జన్మనిస్తే, రాజమౌళి నటుడిగా పునర్జన్మనిచ్చారు. అందుకే ఆయన పేరును నా బిడ్డకు శ్రీరామ్ రాజమౌళి అని పెట్టుకున్నాను " అంటూ ప్రభాకర్ చెబుతున్నాడు. జూన్ 10న ప్రభాకర్, సుమంత్ అశ్విన్ కలిసి నటించిన ' రైట్ రైట్ ' సినిమా రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో ఇలా తన మనసులోని మాటలు షేర్ చేసుకున్నాడు కాలకేయుడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
