మూవీమొఘల్ కు స్మారక చిహ్నం ఏర్పాటు..!
on Jun 6, 2016
చరిత్రలో ఎంతో మంది భాగమవుతుంటారు. కానీ చరిత్రను సృష్టించేవాళ్లు మాత్రం చాలా తక్కువమందే ఉంటారు. అలాంటి వాళ్లలో ఒకరు డా. రామానాయుడు. మూవీ మొఘల్ అన్న పేరు ఆయనకు సరిగ్గా సరిపోతుంది. నిజంగానే ఇండస్ట్రీలో ఒక మొఘల్ చక్రవర్తిలాంటి ప్రొడ్యూసర్ ఆయన. ఎంతో మంది టెక్నీషియన్స్ ను, నటులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత ఆయనది. ఇవాళ్ల ఆయన 80 వ జయంతి. ఈ సందర్భంగా ఆయనకు మెమోరియల్ ను ఏర్పాటు చేస్తున్నారు దగ్గుబాటి వారసులు. రామానాయుడు స్టూడియోస్ లో ఆయనను ఖననం చేసిన ప్రాంతంలోనే దీన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడి స్మృతిఫలకానికి ది నర్చరింగ్ హ్యాండ్స్ అని పేరు పెట్టారు. అంటే పైకి తీసుకొచ్చే చేతులు అని అర్ధం. " మా తండ్రి పైకి తీసుకొచ్చిన ఎంతో మందికి గుర్తుగా దీన్ని ఏర్పాటు చేస్తున్నాం. హైదరాబాద్ లో మెమోరియల్, వైజాగ్ లో మ్యూజియం ఏర్పాటు చేయబోతున్నాం. నాన్నగారు తీసిన సినిమాల్లో మైలురాళ్లుగా నిలిచిన ఎన్నో సినిమాలకు సంబంధించిన వస్తువులన్నీ ఈ మ్యూజియంలో ఉంటాయి. త్వరలోనే రామానాయుడుగారి పేరు మీద ఒక అవార్డును కూడా ఏర్పాటు చేసి, ఏటేటా కళాకారుల్ని సత్కరించాలనుకుంటున్నాం " అన్నారు సురేష్ బాబు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
