రూమర్స్ క్లియర్ చేసేసిన పవన్ డైరెక్టర్..!
on Jun 6, 2016
.jpg)
మురుగదాస్ మహేష్ సినిమాపై గత కొన్నాళ్లుగా రూమర్స్ హల్ చల్ చేస్తున్నాయి. మురుగదాస్ లాంటి డైరెక్టర్, మహేష్ లాంటి స్టార్ కలిస్తే ఆ సినిమాకు ఎంత హైప్ ఉండాలో, అంత క్రేజ్ ఈ సినిమాకు ఇంకా మొదలవకముందే వచ్చేసింది. మూవీలో హీరోయిన్ ఎవరు, విలన్ ఎవరు అన్నదానిపై రకరకాల వార్తలొచ్చాయి. ఎట్టకేలకు రూమర్స్ క్లియర్ అవతున్నట్టు కనిపిస్తోంది. హీరోయిన్ గా బాలీవుడ్ డస్కీ బ్యూటీ పరిణీతి చోప్రా కన్ఫామ్ అయిపోయిందంటున్నాయి మూవీ వర్గాలు. ఇక విలన్ గా ఎస్ జే సూర్య చేస్తున్నాడా లేదా అన్నదానికి కూడా స్వయంగా సూర్యనే సమాధానం ఇచ్చేశాడు. లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూలో, మహేష్ సినిమాలో తనే విలన్ గా చేస్తున్నానని క్లారిటీగా చెప్పేశాడు. దీంతో విలన్ ఎవరన్న రూమర్లకు ఇక చెక్ పడినట్టే. ప్రస్తుతం పవన్ సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్న సూర్య, అందుల్లో పవన్ ఫ్యాక్షనిస్టుగా కనిపిస్తాడని, మూవీ చాలా సరదాగా సాగుతుందని చెబుతున్నాడు. ఓ పక్క సూపర్ స్టార్ సినిమాలో విలన్, మరో పక్క పవర్ స్టార్ సినిమాకు డైరెక్టర్. చూస్తుంటే మనోడు మంచి జాక్ పాట్ కొట్టినట్టున్నాడుగా..!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



