రామ్చరణ్ హీరోయిన్ బన్నీతో రొమాన్స్ !!
on Nov 1, 2018
`నా పేరు సూర్య` తర్వాత కథల విషయంలో చాలా కేర్ తీసుకంటున్నాడు అల్లు అర్జున్. తన తదుపరి సినిమాకోసం ఎన్నో కథలు విన్నాడు. విక్రమ్ కుమార్ డైరక్షన్ లో సినిమా ఫైనల్ అయిందంటూ వార్తలు వచ్చాయి. మరి కొంత మంది దర్శకుల పేర్లు కూడా వినిపించాయి. ఫైనల్ గా స్టార్ డైరక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు బన్ని. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ లో బిజీ బిజీగా ఉన్నాడు త్రివిక్రమ్. ఫుల్ ఎంటర్టైనర్ గా ఉండే ఈ సినిమా డిసెంబర్ 11న గ్రాండ్ గా ప్రారంభం జరుపుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బన్నీ సరసన కియారా అద్వాని హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమెను సంప్రదించిందట చిత్ర యూనిట్. ఈమె గతంలో మహేష్ బాబు తో `భరత్ అనే నేను` చిత్రంలో నటించింది. ఈ సినిమాతోనే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన బక్కపలచని భామ ప్రస్తుతం రామ్ చరణ్ తో రొమాన్స్ చేస్తోంది. అయితే చెర్రీ తర్వాత కైరా అద్వానీ రొమాన్స్ చేయబోయేది బన్నీతో అని తెలుస్తోంది. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి.