సమంతతో చైతు గొడవలు.. కారణం అతనే...!
on Nov 1, 2018

అవును... మీరు చదివిందే నిజమే...,చైతు, సమంతలు గొడవలు పడలేకపోతున్నారట. చైతుకి చాలా కష్టమవుతుందట. కానీ, అది రియల్ లైఫ్ లో కాదు. రీల్ లైఫ్ లో మరి. ఒక సారి ఆ వివరాల్లోకి వెళితే.... చైతు, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. పెళ్లైన తర్వాత ఈ జంట నటిస్తోన్న చిత్రమిది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ అయింది. చైతు, సమంత ఈ చిత్రంలో కూడా మ్యారీడ్ కపుల్ గా నటిస్తున్నారట. అయితే ఇద్దరూ నిత్యం గొడవపడే క్యారక్టర్స్ అట. దీని గురించి సవ్యసాచి సినిమాకు సంబంధించి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగ చైతన్య మాట్లాడుతూ...``రియల్ లైఫ్ లో నేను , సామ్ అసలు గొడవలు పడము. కానీ ఈ మూవీలో నిత్యం గొడవలు పడాల్సి వస్తుంది. కొంచెం నటించడం ఇద్దరికీ కష్టంగానే ఉందంటూ చమత్కరించాడు చైతు. లాస్ట్ టైమ్ ఇద్దరి సినిమాలు ఒకేసారి విడుదలయ్యాయి ఎవరు గెలిచారని అడగ్గా...``యూటర్న్` కి మంచి రివ్యూస్ వచ్చాయి, శైలజా రెడ్డి కలెక్షన్స్ బాగొచ్చాయంటూ ఇద్దర్నీ బేలన్స్ చేశాడు చైతు. పెళ్లయ్యాక బేలన్స్ చేయడం నేర్చుకున్నాను అన్న చైతు బాగానే బేలన్స్ చేసాడు కదా మరి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



