ఎన్టీఆర్ కు బెస్ట్ యాక్టర్ వస్తుందా..?
on Jun 8, 2016
టెంపర్ లో తన కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ అనదగ్గ విధంగా నటించాడు జూనియర్. అయితే ఆ సినిమాకు సైమా అవార్డుల్లో కనీసం నామినేషన్ కూడా రాలేదు. తమ హీరో నటనను అవార్డ్స్ జ్యూర్ గుర్తించకపోవడం పట్ల చాలా డిజప్పాయింట్ అయ్యారు యంగ్ టైగర్ ఫ్యాన్స్. లేటెస్ట్ గా వాళ్లకు ఇప్పుడు ఒక శుభవార్త వచ్చింది. సైమా 2016 ను మిస్ అయినా ఎన్టీఆర్ ఫిల్మ్ ఫేర్ ను మిస్ అవ్వలేదు. ఫిల్మ్ ఫేర్ లో తప్పకుండా తారక్ పేరు ఉంటుందని అందరూ గెస్ చేసిందే నిజమైంది. నామినేషన్లలో ఎన్టీఆర్ కు చోటు దక్కింది. టెంపర్ లో యాక్షన్ సీక్వెన్స్ లతో పాటు, సినిమా క్లైమాక్స్ లో కోర్ట్ సీన్స్ లో తన నట విశ్వరూపం చూపించాడు యంగ్ టైగర్. అందుకే ఫిల్మ్ ఫేర్ కమిటీ ఈ సినిమాను కూడా నామినేట్ చేసింది. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాకు అల్లు అర్జున్, శ్రీమంతుడు సినిమాకు మహేష్ బాబు, భలే భలే మగాడివోయ్ సినిమాకు గాను నాని, బాహుబలి సినిమాతో ప్రభాస్ నామినేట్ అయ్యారు. వీళ్లల్లో ఏ ఒక్కరూ ఇంకొకరికి తీసిపోనట్టుగా నటించారు. మరి అవార్డ్ ఎవరికి వస్తుందో..!