సాయి ధరమ్ తేజ్ జవాన్ అవుతున్నాడు..!
on Jun 8, 2016
.jpg)
సుప్రీంతో కెరీర్ బెస్ట్ హిట్ కొట్టి మంచి ఊపు మీదున్నాడు సాయిధరమ్ తేజ్. ఇదే ఊపులో సినిమా తర్వాత సినిమా కమిట్ అవుతూ స్పీడ్ పెంచేస్తున్నాడు. ఇప్పటికే ' తిక్క ' మూవీకి ఫినిషింగ్ టచ్ లలో బిజీగా ఉన్న తేజు, తర్వాతి రెండు ప్రాజెక్ట్స్ కూడా కమిట్ అయిపోయాడు. వాటిలో బివిఎస్ రవి డైరెక్షన్లో, మరొకటి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రెడీ అవబోతున్నాయి. తిక్క పూర్తవ్వగానే బివిఎస్ రవి షూట్ లో బిజీ అయిపోతాడు తేజూ. ఆ తర్వాత జూ ఎన్టీఆర్ మేనేజర్ కృష్ణ నిర్మాణంలో గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసే సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా గురించి చాలా వార్తలు వస్తున్నాయి. వాటిని నమ్మద్దని స్వయంగా గోపీ చెప్పినా, రూమర్లకు చెక్ పడలేదు. ఇక బివిఎస్ రవి సినిమాకు జవాన్ అనే టైటిల్ ను కన్ఫామ్ చేశారు. ఇంటికొక్కడు అనేది ట్యాగ్ లైన్. ఈ పవర్ ఫుల్ టైటిల్ తో సాయి మరో హిట్ కొడతానని ఆశలు పెట్టుకున్నాడు. మేగామేనల్లుడి హిట్ ట్రాక్ కంటిన్యూ అవుతుందా..చూద్దాం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



