బన్నీ ఒకేసారి ముగ్గురిపై కన్నేశాడు..!
on Jun 8, 2016
స్టైలిష్ స్టార్ బన్నీ స్టార్ మామూలుగా లేదు. సరైనోడు బన్నీని టాప్ లీగ్ లో నిలబెట్టింది. ఇన్నాళ్లూ హిట్స్ కొడుతున్నా, టాప్ ప్లేస్ కు మాత్రం ఎసరు పెట్టలేకపోయాడనే వెలితి బన్నీకి ఈ వేసవితో తీరిపోయింది. ఈ ఏడాది వచ్చిన మహేష్, పవన్ సినిమాలు పెద్ద ప్రభావం చూపించలేకపోవడంతో, ప్రస్తుతానికి నెంబర్ వన్ స్థానానికి చాలా దగ్గరకి వచ్చేశాడు బన్నీ. ఇదే ఊపులో వరసగా డైరెక్టర్లను సెట్ చేసుకుంటున్నాడు. ఫ్యామిలీతో కలిసి టర్కీలో వేకేషన్ లో ఉన్న బన్నీ వారు అక్కడి నుంచే డైరెక్టర్లను సెట్ చేసేస్తున్నారు. ఇప్పటికే మనం, 24 సినిమాల దర్శకుడు విక్రమ్ కె కుమార్ ను కథ సిద్ధం చేయమని చెప్పిన బన్నీ, తమిళ డైరెక్టర్ లింగు స్వామితో బైలింగ్వల్ రెడీ చేస్తున్నాడు. ఇక లేటెస్ట్ గా హరీష్ శంకర్ రెడీ చేసిన స్క్రిప్ట్ కూడా బన్నీకి నచ్చేసిందట. అంతా రెడీ అయితే ముందు ఆ సినిమాయే ఓకే చేద్దామని చెప్పేశాడట బన్నీ. మరి ముగ్గుర్ని లైన్లో పెట్టిన బన్నీ వారు ఇక్కడికి వచ్చాక ఏ సినిమా ఫస్ట్ స్టార్ట్ చేస్తారో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



