ఇదే జనతా గ్యారేజ్ ఫస్ట్ లుక్..!
on May 19, 2016
.jpg)
రేపు తన పుట్టిన రోజు సందర్భంగా, ఫ్యాన్స్ కు గిఫ్ట్ ఇచ్చాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. జనతా గ్యారేజ్ ఫస్ట్ లుక్ తో అభిమానులకను ఫుల్ ఖుష్ చేశాడు. బండి మీద కూర్చుని వెళ్తున్న స్టైలిష్ ఫోటోను ఫస్ట్ లుక్ గా రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ లుక్ పరంగా కొద్దిగా డిఫరెంట్ గా ఉండటమే కాక, కొద్దిగా సన్నంగా కనబడటం విశేషం. ముందునుంచీ చెబుతున్నట్టుగానే, ఇక్కడ అన్నీ రిపేర్ చేయబడును అనే ట్యాగ్ లైన్ ను తగిలించారు. గడ్డంతో పూర్తి రగ్గడ్ గా తారక్ లుక్ ఫ్యాన్స్ కు పండగ చేయించేలా, మూవీపై ఎక్స్ పెక్టేషన్స్ మరింత పెంచేలా ఉంది. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను శ్రీమంతుడు సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. సినిమా మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే..
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



