హీరోయిన్ అనుష్క కెరీర్ ముగిసిందా..!
on May 19, 2016
అరుంధతితో పూర్తిగా వేరే స్థాయిలోకి చేరుకుంది అనుష్క. ఆ తర్వాత పెద్ద హిట్లేమీ పడకపోయినా, రుద్రమదేవి, బాహుబలి సినిమాలు ఆమెను రేస్ లో నిలబెట్టాయి. సైజ్ జీరో సినిమా తర్వాత అనుష్క కెరీర్ బాగా డల్ అయిపోయింది. ప్రస్తుతం అనుష్క వయసు 34. ఏజ్ ఇంకా ముదరక ముందే పెళ్లి చేసుకుంటే మంచిదని కుటుంబ సభ్యులు స్వీటీ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారట. దాంతో ఇప్పటి వరకూ కమిటైన సినిమాలన్నీ పూర్తి చేసి పెళ్లి చేసేసుకుంటాను అని ఈ మంగుళూరు భామ క్లారిటీ ఇచ్చిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం సింగం 3, బాహుబలి 2, అజిత్ తో ఒక సినిమా, భాగమతి అనే ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీలు లైన్లో ఉన్నాయి. ఇవి కాకుండా, మెగా 150లో కూడా ఆమె నటించే అవకాశాలున్నాయి. ఈ ప్రాజెక్ట్ లన్నీ కంప్లీట్ చేసేసి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తానని స్వీటీ షెట్టీ, ఫ్యామిలీకి చెప్పేసిందట. ఈ న్యూస్ ఆమె అభిమానులకు గుండెల్లో రాయి పడింది. మరి ఈ వార్తల్లో ఎంత వరకూ నిజముందో దేవసేన స్పందిస్తే ఒక క్లారిటీ వచ్చేస్తుంది.