రానా, మిహీకా మధ్య బంధం భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది?
on May 25, 2020
ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు, అలా జరగడానికి ఈ విశ్వం దోహదం చేసిందని చాలా మంది నమ్ముతారు. వారి ఆత్మలు ఒకదాని మార్గంలో మరొకటి వెళ్లడానికి నక్షత్రాలు, గ్రహాలు, శక్తులు కలిసి పనిచేశాయన్న మాట. ఆ ఇద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారా, ఒకరికొకరు అనుకూలంగా ఉన్నారా, ఎంతకాలం కలిసి ఉంటారు.. అనే విషయాలన్నీ నక్షత్రాల్లో రాసి ఉంటాయని కూడా నమ్ముతుంటారు.
మనుషుల వ్యక్తిత్వాలు, గుణగణాల గురించి రాసి చిహ్నాలు చాలా చెప్పగలుగుతాయి. ఇటీవలే నిశ్చితార్ధం చేసుకున్న రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్ ఒకరికొకరు ఎంత అనుకూలంగా ఉన్నారో ఇప్పుడు చూద్దాం...
రానా దగ్గుబాటి
నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త అయిన రానా దగ్గుబాటి డిసెంబర్ 14న జన్మించాడు. అతనిది ధనుర్రాసి. అందువల్ల అతను బలమైన సంకల్పశక్తి, స్వతంత్ర భావాలున్న వ్యక్తిగా రూపొందాడు. సహజసిద్ధంగానే అతనికి నాయకత్వ లక్షణాలు అలవడ్డాయి. తన గురించి జనం ఏమనుకుంటుంటారో అనే విషయం పట్టించుకోడు, తను కోరుకున్నది చేయడానికి భయపడడు. ఇతరుల బాటలో నడవడానికి అతనేమాత్రం సంకోచించడు. ఆ గుణమే అతడిని సక్సెస్ఫుల్ యాక్టర్‌గా మార్చింది. ఎవరైనా తమ రహస్యాలను నిస్సంకోచంగా అతడికి చెప్పకోవచ్చు. ప్రతి ధనుర్రాసి వ్యక్తి తరహాలోనే అతను వాటిని ఎలాంటి పరిస్థితుల్లోనూ బయటపెట్టడు. సృజనాత్మకంగా ఆలోచించే అతను ఏ టీమ్‌లో ఉంటే ఆ టీమ్‌కు శక్తినిస్తాడు. కొత్త విషయాలపై అనురక్తితో తన ఆలోచనలను అందరితో పంచుకొని, టీమ్‌కు వెలుగునిస్తాడు.
మిహీకా బజాజ్
డిసెంబర్ 19న పుట్టిన మిహీకా కూడా ధనుర్రాసి అమ్మాయి. అందువల్ల సామర్థ్యం, చురుకుదనం విషయంలో చాలా ముందుంటుంది. తనకు ఎదురైన ఎలాంటి సవాళ్లనైనా వాస్తవికంగా ఎదుర్కొంటుంది. నిజాయితీ ఆమె బలం. తన భావోద్వేగాలను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ ఉంటుంది. ఏదైనా కావాలనుకున్నదంటే, వెనకడుగు వేయకుండా దాని కోసం పనిచేస్తుంది. ఆమెకు ఊహాశక్తి, దీర్ఘకాల దృష్టి ఎక్కువ. అందువల్లే మంచి వ్యాపారవేత్త, సీఈఓ కాగలిగింది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే ఆమె, సవాళ్లను ప్రేమిస్తుంది. కొత్త పుస్తకమన్నా, కొత్త మూవీ అన్నా ఆసక్తి చూపుతుంది.
రానా, మిహీకా మధ్య అనుకూలత
మనస్తత్వ పరంగా ఒకే రకంగా ఉండటం, ఒకే రకమైన ఆలోచనలు, దృష్టి ఉండటం వల్ల ధనుర్రాసికి చెందిన రానా, మిహీకా మధ్య సమన్వయం కూడా ఎక్కువే. అందువల్ల పరస్పరం తమ జీవితాల్ని పంచుకోవడం వాళ్లకు చాలా తేలిక. అనుబంధాల విషయంలో ఎలా సర్దుకుపోవాలో, ఎక్కడ రాజీ పడాలో వాళ్లకు బాగా తెలుసు. ధనుర్రాసి వ్యక్తులకు ఆవేశం పాలు కాస్త ఎక్కవ అయినప్పటికీ, సహనం కాస్త తక్కువ అయినప్పటికీ, తమ ఆసక్తులను, తమ ఆలోచనలను పరస్పరం పంచుకొనే గుణం కారణంగా, భేదాభిప్రాయాలు వ్యక్తమైనప్పుడు వాటిమీద పోట్లాటకు దిగరు. తమ కోపాన్ని చూసుకొని నవ్వి, సాధారణ స్థితికి వచ్చేస్తారు. అందుకే రానా, మిహీకా జంట భవిష్యత్తులో ఆదర్శప్రాయమైన జంటగా పేరు తెచ్చుకుంటుందని భావించవచ్చు.