‘ఎర్రబస్సు' ఆడియో వచ్చేసింది
on Nov 1, 2014
దర్శకరత్న దాసరి నారాయణరావు స్వీయ దర్శకత్వంలో 151వ చిత్రంగా రూపొందుతున్న ‘ఎర్రబస్సు' సినిమా ఆడియో గ్రాండ్ గా రిలీజైంది. కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ఆడియోను ఆవిష్కరించి తొలి సిడిని సీనియర్ నిర్మాత కె.రాఘవకు అందజేశారు.ఈవివి కళావాహిని అధ్యక్షుడు వెచ్చా కృష్ణముర్తి తొలి సిడిని 10,116రూపాయలకు కొనుగోలు చేశారు. ఈ మొత్తాన్ని తుఫాన్ భాదితులకు విరాళం ఇస్తున్నట్టు దాసరి ప్రకటించారు. ఈ సంధర్బంగా దాసరి నారాయణరావు మాట్లాడుతూ.. ''అందరికి విష్ణులో యాక్షన్ హీరో కనబడితే నాకు శోభన్ బాబు కనిపిస్తాడు. ఈ సినిమా ద్వారా విష్ణు ఎంత గొప్ప నటుడో అందరికీ తెలుస్తుంది. క్లైమాక్స్ లో నాతో పోటిపడి నటించాడు. నా బ్లాక్ బస్టర్ సినిమాలలో ‘ఎర్రబస్సు’ ఒకటిగా నిలుస్తుంది'' అని అన్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
