సన్నీలియోన్‌కి ఎంతిచ్చారు...?
on Nov 1, 2014

కరెంట్ తీగ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టేసింది సన్నీలియోన్. సన్నీ ఎంట్రీకీ, ఆమె తెరకెక్కించిన పాటకీ.. మాస్ జనాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చేసింది. దాంతో చిత్రబృందం చేసిన ప్రయత్నం ఫలించినట్టైంది. ఈ సినిమా కోసం సన్నీ కేవలం 5 రోజులు మాత్రమే కాల్షీట్లు కేటాయించింది. ఐదు రోజుల కోసం ఎంత తీసుకొందో తెలుసా...?? రూ.75 లక్షలు. వామ్మో.. రోజుకి పాతిక లక్షలన్నమాట. సన్నీ ఇచ్చిన 5 రోజుల్ని చిత్రబృందం బాగానే ఉపయోగించుకొంది. ఆమెపై ఐదారు సీన్లు, ఓ హాట్ పాటని తెరకెక్కించగలిగారు. అంతేకాదు... సన్నీతో వీడియో ఇంటర్వ్యూలు చేయించి, మీడియాకు అందించారు. ఈ 5 రోజులూ సన్నీలియోన్ అందించిన కోపరేషన్ అదిరిపోయిందని చిత్రబృందమే చెబుతోంది. రూ.75 లక్షలు గిట్టుబాటు అయ్యే సూచనలూ కనిపిస్తున్నాయి. ఎందుంకంటే సన్నీ ఎంట్రీకి థియేటర్లో వస్తున్న రెస్పాన్స్ అలా ఉందిమరి. ఈ సినిమాతో తెలుగు నిర్మాతలు సన్నీ నామ జపం చేయడం ఖాయం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



