జక్కన్న సవాల్‌కు సై అన్న సుక్కు
on Apr 22, 2020
'అర్జున్‌రెడ్డి' డైరెక్టర్ వంగా సందీప్‌రెడ్డి స్టార్ట్ చేసిన #BeTheRealMan ఛాలెంజ్ టాలీవుడ్‌లో జోరుగా నడుస్తోంది. సందీప్‌రెడ్డి సవాల్‌ను రాజమౌళి అలియాస్ జక్కన్న స్వీకరించి, ఇంటిని శుభ్రం చేశాడు. ఆయనిచ్చిన సవాల్‌ను జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ నిన్న స్వీకరించి, తమ ఇళ్లను క్లీన్ చేశారు. జక్కన్న ఛాలెంజ్ చేసిన వాళ్లలో డైరెక్టర్ సుకుమార్ కూడా ఉన్నాడు. బుధవారం సుక్కు ఆ సవాల్‌ను స్వీకరించి, ఇంటిని శుభ్రం చేసి, భార్యకు సాయం చేశాడు. ముందు చీపురు పట్టుకొని ఇల్లు ఊడ్చిన సుక్కు, తర్వాత తడికర్రతో శుభ్రం చేశాడు. ఆపైన అంట్లు తోమి, వంట చేస్తున్న భార్య దగ్గరకు ఆ వంటపాత్రలను తీసుకొచ్చి ఇచ్చి రియల్ మ్యాన్ అనిపించుకున్నాడు.
#BeTheRealMan ఛాలెంజ్‌ను సుక్కు కూడా కొంతమందికి విసిరాడు. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, డైరెక్టర్లు వంశీ పైడిపల్లి, సురేందర్‌రెడ్డి, కొరటాల శివ, ప్రొడ్యూసర్ దిల్ రాజు లకు ఆయన చాలెంజ్ చేశాడు. లాక్‌డౌన్ కారణంగా ఇళ్లల్లోనే ఉంటున్న సినీ సెలబ్రిటీలు తమ కుటుంబసభ్యులకు ఇంటిపనిలోనూ, వంటపనిలోనూ సాయపడాలనేది #BeTheRealMan ఉద్దేశం.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
