తమిళంలో మెగా మేనల్లుడి మొదటి సినిమా రీమేక్?
on Apr 22, 2020
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, హీరో సాయి తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న సినిమా 'ఉప్పెన'. తెలుగులో సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. ఎప్పుడు అవుతుందో తెలియదు. అయితే... ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేయడానికి డిస్కషన్స్ జరుగుతున్నాయి. దీనికి కారణం... మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. 'ఉప్పెన'లో ఆయన విలన్ రోల్ చేస్తున్నారు. ఆయనకు కథంతా తెలుసు. దర్శకుడితో తన తమిళ క్లాసిక్ హిట్ '96' కంటే మంచి సినిమా అని విజయ్ సేతుపతి చెప్పారట. అంతే కాదు... తమిళంలో తన నిర్మాణంలో సినిమాను రీమేక్ చేస్తానని అన్నారట. తెలుగులో రిలీజ్ అయిన తర్వాత తమిళ రీమేక్ పనులు ప్రారంభిస్తారేమో.
కాకినాడ నేపథ్యంలో సముద్రతీర ప్రాంతంలో జరిగే కథతో 'ఉప్పెన' తెరకెక్కిస్తున్నారు. తమిళనాట సముద్రతీర ప్రాంతం ఎక్కువే. చెన్నై నేపథ్యంలో కథను సులభంగా మార్చుకోవచ్చు. పైగా, అక్కడి నేటివిటీకి కథ మరింత సూటవుతుంది. అందుకని, విజయ్ సేతుపతి తమిళంలో రీమేక్ చేయాలనుకున్నారు.