అక్కడ ప్రభు... ఇక్కడ రాజేంద్రప్రసాద్
on Feb 22, 2020
తండ్రిని కొడుకు చదివిస్తే... ఆల్మోస్ట్ 50 ఇయర్స్ ఏజ్‌లో ఓ వ్యక్తి కాలేజీకి వెళితే ఎలా ఉంటుందనే పాయింట్ చుట్టూ అల్లిన కథతో తెరకెక్కిన సినిమా 'కాలేజ్ కుమార్'. ఫైట్ మాస్టర్ విజయ్ కుమారుడు రాహుల్ విజయ్ హీరోగా నటించాడు. మార్చి 6న సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. శుక్రవారం ట్రైలర్ రిలీజ్ చేశారు. కాలేజీకి వెళ్లే తండ్రిగా నటకిరీటి రాజేంద్రప్రసాద్ నటించారు. ట్రైలర్ ఎండింగ్ సీన్, ఆయన కామెడీ టైమింగ్ సినిమాపై క్యూరియాసిటీ క్రియేట్ చేశాయి.
ఇక్కడ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే... ఈ సినిమాను తెలుగు, తమిళ లాంగ్వేజెస్‌లో తీశారు. తెలుగులో ఫాదర్ రోల్ రాజేంద్రప్రసాద్ చేస్తే... తమిళంలో ఆ ఫాదర్ రోల్ ప్రభు చేశారు. మిగతా ఆర్టిస్టులు ఆల్మోస్ట్ సేమ్. మదర్ రోల్ మధుబాల చేశారు. మొత్తంగా చూస్తే తమిళ్ ఆర్టిస్టులు ఎక్కువ ఉన్నారు. అయితే... హీరోయిన్ మాత్రం తెలుగమ్మాయే. ప్రియా వడ్లమాని కథానాయికగా నటించారు. ఆడియన్స్ కి నేటివ్ ఫీల్ తీసుకురావడం కోసం అక్కడ ప్రభు... ఇక్కడ రాజేంద్రప్రసాద్ చేత ఫాదర్ రోల్ చేయించినట్టు ఉన్నారు.