టామ్ అండ్ జెర్రీలా మహేష్... నటకిరీటి
on Nov 19, 2019

మహేష్ బాబు కామెడీ టైమింగ్ సూపర్ గా ఉంటుంది. 'ఖలేజా', 'దూకుడు' అందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. కామెడీ సీన్స్ రాయడంలో అనిల్ రావిపూడిది అందెవేసిన చెయ్యి. 'పటాస్' నుండి 'ఎఫ్ 2' వరకు కామెడీతోనే ఈ దర్శకుడు హిట్లు కొట్టాడు. మహేష్, అనిల్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు ఇదొక సీరియస్ సినిమా అనే కలర్ ఇచ్చింది. మహేష్ ఆర్మీ ఆఫీసర్ లుక్ ఫస్ట్ వచ్చింది. తర్వాత కొండారెడ్డి బురుజు ముందు మహేష్ గొడ్డలి పట్టుకున్న లుక్ వచ్చింది. అయితే, ఈ సినిమాలో కామెడీ కూడా ఫుల్లుగా ఉంటుందని నటకిరీటి రాజేంద్రప్రసాద్ అన్నారు.
"'సరిలేరు నీకెవ్వరు'లో మహేష్ బాబుతో నా పాత్ర టామ్ అండ్ జెర్రీలా ఉంటుంది" అని రాజేంద్రప్రసాద్ అన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కేరళలో జరుగుతోంది. అక్కడ ఫైట్ సీన్స్ తీస్తున్నారట. ఆల్రెడీ జమ్మూ కశ్మీర్, హైదరాబాద్ లో చాలా వరకు సీన్స్ తీశారు. కేరళ షెడ్యూల్ తో దాదాపు సినిమా పూర్తి అవుతుంది. తమన్నాతో మహేష్ ఇంట్రడక్షన్ సాంగ్ కేరళ నుండి వచ్చాక షూట్ చేసేలా ప్లాన్ చేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



