గౌతమీపుత్ర శాతకర్ణికి కథ ఇతనిదే..
on Apr 26, 2016

నటసింహ నందమూరి బాలకృష్ణ 100 వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికి సంబంధించి రోజుకొక న్యూస్ బయటికొస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా, తన కెరిర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచిపోయేలా రూపొందించాలనుకుంటున్నారు బాలయ్య. అందుకోసం కథ, కథనాల విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు. బాలకృష్ణ 100వ సినిమా అనేసరికి డైరెక్టర్ ఎవరు, కథ ఎలా ఉండబోతోంది అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూశారు. అనేక తర్జన భర్జనల తర్వాత క్రిష్ దర్శకత్వంలో గౌతమీపుత్ర శాతకర్ణిని చేస్తున్నట్లు ప్రకటించారు. అంతే స్పీడుగా లాంఛింగ్ కార్యక్రమం జరిగిపోయింది.
తెలుగుజాతి చరిత్రలో గొప్ప చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణికి సంబంధించిన పూర్తి చరిత్రను తెలుసుకునేందుకు దానిని ప్రజలకు అందించాలని బాలయ్య తాపత్రాయపడుతున్నారు. అందుకే మొన్న బౌద్ధ గురువులను తన ఇంటికి పిలిపించుకుని హిస్టరీ తెలుసుకుంటున్నారు. అయితే బాలయ్య ఆరు నెలల క్రితమే గౌతమీపుత్ర శాతకర్ణి పాత్రను చేయాలనుకున్నారట. అందుకు తగ్గట్టుగానే శ్రీవెంకటేశ్వర ఆయుర్వేద కళాశాలలో సీనియర్ లెక్చరర్‌గా పనిచేసిన ఆచార్య రంగనాయకుల్ని సంప్రదించారట. ఆయన కూడా బాలయ్య అడిగిన వెంటనే పలు చారిత్రక అంశాలను పరిశీలించి శాతకర్ణికి సంబంధించిన ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించారు. ఆ కథను సినిమాకు తగ్గట్టుగా సిద్ధం చేసి దర్శకుడు క్రిష్‌కి అందజేశారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి బాలకృష్ణ స్వయంగా రంగనాయకులు గారిని ఆహ్వానించి సత్కరించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



