ఒకేరోజు మొదలవుతున్న చిరు పవన్ సినిమాలు..!
on Apr 26, 2016

మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ తర్వాతి సినిమాల గురించి ఇండస్ట్రీ చాలా ఆసక్తిగా చూస్తోంది. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత చిరు చేస్తున్న సినిమా, పైగా ల్యాండ్ మార్క్ 150 ఫిల్మ్. దీంతో చిరు సినిమా ఎప్పుడు మొదలెడతారా అని ఒకవైపు, ఎంతో ఇష్టపడి చేసిన సర్దార్ ఫ్లాప్ అయిన తర్వాత, పవన్ ఎలాంటి సినిమా తీయబోతున్నారా అని మరో వైపు. ఇలా ఇద్దరు తమపై ఉన్న సినీజనాల ఆసక్తికి మెగా బ్రదర్స్ ఒకేసారి కొబ్బరికాయ కొట్టి ఆన్సర్ ఇవ్వబోతున్నారు. ఏప్రిల్ 29 తర్వాత మళ్లీ ఆగష్ట్ వరకూ ముహూర్తాలు లేవు. దీంతో ఆ రోజునే మెగా 150, పవన్ ఎస్ జే సూర్య సినిమాకు ముహూర్తం పెట్టేయాలని ఫిక్స్ అయ్యారు. చిరు సినిమా కత్తి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే వినాయక్ తయారుచేసిన స్క్రిప్ట్ ను మెగాస్టార్ ఫైనల్ చేసేశారు. ఈ సినిమాకు కత్తిలాంటోడు అనే టైటిల్ ను అనుకుంటున్నా, అది మెగా ఇమేజ్ కు ఎంత వరకూ సెట్ అవుతుందా అన్న అనుమానాలున్నాయి. మరో వైపు పవన్ ఎస్ జే సూర్యల సినిమాకు హుషారు అనే టైటిల్ ను అనుకుంటున్నారని సమాచారం. చిరు 150కి దేవీశ్రీప్రసాద్, పవన్ సూర్య సినిమాకు అనూప్ రూబెన్స్ స్వరాలందిస్తున్నారు. అనూప్ ఇప్పటికే పవన్ గోపాల గోపాల సినిమాకు సంగీతం అందించిన సంగతి తెలిసిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



