సినిమా చూసి ఆత్మహత్య చేసుకున్న నిర్మాత..!
on Apr 26, 2016

సినిమా అంటే అతనికి ప్రాణం. అందుకే మంచి సినిమా తీయాలనుకున్నాడు. కోట్లకు కోట్లు పెట్టి సినిమా తీశాడు. కానీ ప్రీమియర్ షో చూసుకున్న తర్వాత సినిమా పరిస్థితి అర్ధమైంది. తాను నిండా మునిగిపోయాననుకున్న ఆ నిర్మాత సూసైడ్ చేసుకున్నాడు. మల్లూవుడ్ కు సంబంధించిన అజయ్ కృష్ణన్ పలు టివీ సీరియల్స్ లో నటించి పేరుతో పాటు కొద్దిగా డబ్బు సంపాదించుకున్నాడు. తాను సంపాదించిన డబ్బుతో ఒక మంచి సినిమా తీయాలనుకుని అవరుడే రావుకాల్ అనే సినిమాను తీశాడు. తీరా సినిమా పూర్తైన తర్వాత ప్రివ్యూ షో చూసుకుంటే, మూవీ చాలా ఘోరంగా ఉందని అజయ్ కు అర్ధమైంది. తాను పెట్టిన 4 కోట్లలో కనీసం సగం కూడా వెనక్కి రాదని అభిప్రాయపడిన అజయ్, తిరుమల్లావరంలోని తన నివాసంలో సూసైడ్ చేసుకున్నాడు. సినిమా కోసం అతను చేసిన అప్పులే అతన్ని ఈ అఘాయిత్యానికి పాల్పడేలా చేశాయని సన్నిహితులు చెబుతున్నారు. ఈ సంఘటనపై మళయాళ పరిశ్రమ దీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



