చరణ్ కాదన్నాడు.. బన్నీ ఔనన్నాడు
on Nov 5, 2014
.jpg)
రామ్‌చరణ్‌తో ఓ సినిమా చేయాలని బోయపాటి శ్రీను ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాడు. రెండు మూడు కథలు రెడీ చేసుకొన్నాడు కూడా. చిరు, చరణ్‌లకూ వినిపించాడు. అయితే ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. దాంతో లెజెండ్ లాంటి హిట్ తరవాత కూడా బోయపాటి ఖాళీగా ఉండాల్సివచ్చింది. ఇప్పుడు మరో మెగా హీరోతో సినిమాని పట్టాలెక్కించబోతున్నాడు. ఆ హీరోనే... అల్లు అర్జున్. ఔను... బన్నీ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ విషయాన్ని బోయపాటి శ్రీను కూడా ధృవీకరించాడు. వచ్చే యేడాది మార్చిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించనుంది. అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. మార్చిలో పూర్తవుతుంది. ఆ తరవాత బోయపాటి శ్రీను సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. చరణ్ నో చెప్పిన కథే బన్నీ తో తీస్తున్నారని ఫిల్మ్‌నగర్‌లో టాక్. మరి చరణ్, బన్నీ తీసుకొన్న నిర్ణయాల్లో ఏది కరెక్టో తెలియాలంటే మరో యేడాదైనా ఆగాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



