బెల్లంకొండ కాదు.. అనకొండ!
on Nov 6, 2014
.bmp)
ఎప్పుడు ఎక్కడ ఎలాంటి మెలిక వేయాలో బెల్లంకొండ సురేష్‌కి బాగా తెలుసు. రభస తరవాత హడావుడిగా బెల్లంకొండ శ్రీనివాస్ - బోయపాటి శ్రీను కాంబినేషన్ సెట్ చేసేశాడు. అయితే ఆ సినిమా ఇప్పటి వరకూ సెట్స్‌పైకి వెళ్లలేదు. ఎప్పుడు మొదలవుతుందో తెలీదు. పెట్టుబడి లేకపోవడంతో బెల్లంకొండ ఈ సినిమా ఊసెత్తడం లేదు. దాంతో... బోయపాటికీ విసుగొచ్చింది. అర్జెంటుగా బన్నీతో ఓ కథ సెట్ చేసి, ఫిబ్రవరిలో షూటింగ్ మొదలెట్టేద్దామనుకొన్నాడు. ఈ విషయం తెలిసి బెల్లంకొండ గాబరా పడిపోయాడట. వెంటనే బోయపాటి దగ్గరకు వెళ్లి...''నా సినిమా పూర్తి చేయ్.. ఆ తరవాతే మిగిలిన సినిమాలు చూసుకో..'' అన్నాడట్ట. మరి డబ్బుల్లేవు కదా అంటే '' ఆ సంగతి నేను చూసుకొంటా. డిసెంబర్‌లో మన సినిమా పక్కాగా మొదలెట్టేద్దాం. ఇది ఖాయం'' అంటూ మాటిచ్చేశాడట. దాంతో బెల్లంకొండ దగ్గర లాక్ పడిపోయాడు బోయపాటి. తానూ తక్కువ వాడు కాదు కాబట్టి శ్రీనివాస్ సినిమా మొదలెట్టినా, లేకపోయినా - ఫిబ్రవరిలో బన్నీ సినిమా మొదలెట్టేస్తా అని కాస్త గట్టిగానే చెప్పాడట. దాంతో బెల్లంకొండ ఇప్పుడు పెట్టుబడి పెట్టేందుకు ఎవరు దొరుకుతారా అని కాచుకొని కూర్చున్నట్టు ఫిల్మ్‌నగర్ వర్గాలు చెబుతున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



