పవన్ అత్తతో.. వెంకీ ఏం చేస్తాడు?
on Nov 4, 2014
.jpg)
అత్తారింటికి దారేదితో మళ్లీ తెరపైకొచ్చింది నదియా. ఆ తరహా పాత్రల్లో సూటైపోతానని నిరూపించుకొంది. దృశ్యం సినిమాలోనూ తన నటనతో ఆకట్టుకొంది. పెద్దరికం, హుందాతనం కలబోసిన పాత్రలకు ఆమె సూటైపోతుందని దర్శకులూ భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు అలాంటి మరో అవకాశం దక్కింది. వెంకటేష్ కథానాయకుడిగా వారాహి చలన చిత్రం సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించాలని భావిస్తోంది. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహిస్తారు. ఈ సినిమాలో వెంకటేష్ సరసన నదియా నటించనుందని సమాచారమ్. 40లో పడిన భార్యాభర్తల కథ ఇది. వారి మధ్య జరిగే సంఘటనలు, వారి మధ్య బంధాలూ.. ఈ కథకు బలం. ఈ సినిమాలో మరో యువ జంట కూడా ఉందట. అందుకోసం నూతన నటీనటులను ఎంచుకోవాలని చిత్రబృందం భావిస్తోంది. దృశ్యంలానే.. ఇది కూడా ఓ కొత్త కథ అట. హీరో అంటే యాభై దాటినా పదహారేళ్ల అమ్మాయిలతో డ్యూయెట్లు పాడాలని చూస్తున్న ఈ తరుణంలో వెంకీ ఆ మూస నుంచి బయటకు వచ్చి.. కొత్త దారిలో నడవడం ఆదర్శప్రాయమే. మరి పవన్ అత్తతో వెంకీ చేసే రొమాన్స్ ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



