అల్లు అర్జున్ గ్యారేజ్‌లోని 5 అత్యంత ఖరీదైన వాహనాలు
on Oct 14, 2020
టాలీవుడ్ టాప్ యాక్టర్లలో అల్లు అర్జున్ అలియాస్ బన్నీ ఒకరు. ఫ్యాన్స్ మాత్రమే కాకుండా విమర్శకుల అభిమానాన్ని సంపాదించుకున్న నటుడాయన. 2020 సంక్రాంతికి వచ్చిన 'అల.. వైకుంఠపురములో' చిత్రంతో కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌ను సాధించాడు. ప్రస్తుతం ఆ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. ఆయన గ్యారేజ్‌లో ఇతరులు అసూయసడే రీతిలో కార్లు, ఇతర వాహనాల కలెక్షన్ ఉంది. 36 సంవత్సరాల బన్నీ దగ్గర ఎలాంటి కార్లు ఉన్నాయి, ఆయన ఏయే వాహనాల్లో తిరుగుతుంటాడనే విషయం తెలుసుకోవడానికి చాలా మంది తహతహలాడుతూ ఉంటారు. అలాంటివారి కోసం ఈ సమాచారం...
1. రేంజ్ రోవర్ వోగ్
ఇటీవల తన ట్విట్టర్ ఫాలోయర్లకు కొత్తగా తెచ్చిన తన కారును పరిచయం చేశాడు బన్నీ. దానికి బీస్ట్ అని పేరు పెట్టినట్లు ఆయన తెలిపాడు. అది రేంజ్ రోవర్ వోగ్. దాని విలువ రూ. 1.88 కోట్ల నుంచి రూ. 4.03 కోట్ల మధ్య ఉంటుంది. మనం ఎంచుకొనే వేరియంట్‌ను బట్టి ఈ రేటు ఉంటుంది.
2. జాగ్వార్ ఎక్స్జెఎల్
బన్నీ గ్యారేజ్‌లో జాగ్వార్ ఎక్స్జెఎల్ కారు ఉంది. 301.73 బీహెచ్పీ పవర్‌తో 3.0-లీటర్ డీజిల్ మోటార్ ఉండే ఈ కారుకు 7-స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 250 కి.మీ. దీని ఖరీదు రూ. 1.2 కోట్లు.
3. ఫాల్కన్ వ్యానిటీ వ్యాన్
తన పర్సనల్ కారవాన్‌కు ఫాల్కన్ అనే పేరు పెట్టాడు బన్నీ. ఈ బ్లాక్ కలర్ వ్యాన్ లోపల సిల్వర్, బ్లాక్ కలర్ ఇంటీరియర్ కనిపిస్తుంది. షూటింగ్ సెట్స్‌పై షాట్ గ్యాప్‌ల మధ్య ఈ వ్యాన్‌లో రిలాక్స్ అవుతుంటాడు బన్నీ. ఇంట్లో ఉండే అన్ని రకాల సౌకర్యాలు ఇందులో ఉంటాయి. ఈ వ్యాన్ వెల ఎంతో తెలుసా? అక్షరాలా రూ. 7 కోట్లు
4. హమ్మర్ హెచ్2
గంటకు 190 కి.మీ మాగ్జిమమ్ స్పీడ్‌తో వెళ్లగల ఎస్యూవీ వెహికల్ హమ్మర్ హెచ్2 బన్నీ గ్యారేజ్‌లో ఉంది. 0 నుంచి గంటకు 100 కి.మీ వేగాన్ని పుంజుకోవడానికి దీనికి పట్టే సమయం కేవలం 9.2 సెకన్లు మాత్రమే. రఫ్ అండ్ టఫ్‌గా వాడటానికి అనువుగా ఉండే దీని మార్కెట్ ప్రైస్ రూ. 75 లక్షలు.
5. వోల్వో ఎక్స్‌సి90 టి8 ఎక్సలెన్స్
ఎప్పుడైనా ప్రమోషనల్ టూర్స్‌కు వెళ్లేప్పుడు బన్నీ వాడే వాహనం వోల్వో ఎక్స్‌సి90 టి8 ఎక్సలెన్స్. ఫ్యాన్స్‌తో మాట్లాడటానికి అనువుగా దీనికి సన్‌రూఫ్ సౌకర్యం ఉంటుంది. 6 సెకన్లలోనే గంటకు 100 కి.మీ. వేగాన్ని అందుకోగల ఈ కారు మాగ్జిమమ్ స్పీడ్ గంటకు 230 కి.మీ. దీని ఖరీదు రూ. 1.3 కోట్ల నుంచి 1.35 కోట్ల వరకు ఉంటుంది.
Also Read