English | Telugu

ఇద్దరు బాలయ్యలు.. ఇద్దరు పవన్‌కళ్యాణ్‌లు నిజమేనా..?

on Jan 9, 2018

హీరోలు తమను తాము నటుడిగా ప్రూవ్ చేసుకోవాలని ఎంతో తపన పడుతుంటారు. అందుకోసం కొత్త కథలు, నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇవేవి కాకుండా తమను తాము నిరూపించుకోవడానికి బెస్ట్ ఛాయిస్ అంటే డ్యూయెల్ రోల్సే. నాటి సీనియర్ ఎన్టీఆర్ నుంచి నేటి జూనియర్ ఎన్టీఆర్ వరకు అందరూ ఈ ఫార్మూలాని ట్రై చేసి సక్సెస్ కొట్టినవారే. సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే తాము డ్యూయెల్ రోల్స్ చేస్తున్నామని చెప్పేవారు కొందరైతే.. సినిమాలో సర్‌ప్ర్రైజ్ ఇచ్చేవారు మరికొందరు.

ఇప్పుడు ఇదే లిస్ట్‌లోకి చేరారు నటసింహాం నందమూరి బాలకృష్ణ, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్. ఈ ఏడాది సంక్రాంతి బరిలో ఈ ఇద్దరు స్టార్స్ పోటీ పడుతున్నారు. రెండు సినిమాలు డిఫరెంట్ జోనర్ కథలే.. కానీ ఒక విషయంలో ఈ రెండు సినిమాలకు పోలిక ఉందట. అదే డ్యూయెల్ రోల్స్.. అజ్ఞాతవాసిలో పవన్.. జైసింహాలో బాలయ్య డ్యూయెల్ రోల్స్ వేసినట్లు ఒక వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది.

అజ్ఞాతవాసిలో పవన్ కళ్యాణ్ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడట..? ఈ విషయాన్ని యూనిట్ కావాలనే రహస్యంగా ఉంచిందని ప్రచారం జరుగుతోంది. ఇందులోని రెండు పాత్రలకు ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారట.. రెండు పాత్రలు ఒకే జనరేషన్‌కు చెందినవని అంటున్నారు.. ఇక జై సింహా విషయానికి వస్తే.. సెంటిమెంట్స్‌పై విపరీతమైన నమ్మకం ఉన్న బాలయ్య తనకు బాగా కలిసి వచ్చిన ఫ్లాష్‌బ్యాక్ అస్త్రాన్ని ఇందులోనూ ప్రయోగించాడట. ఇందుకోసం బాలయ్య రెండు గెటప్స్ ఎంచుకున్నాడట. ఒక క్యారెక్టర్ పేరు జై, మరొక దానిపేరు సింహా అంటూ ప్రచారం జరుగుతోంది. మరి ఈ రెండు సినిమాల్లో ఇద్దరు పవన్ కళ్యాణ్‌లు.. ఇద్దరు బాలయ్యలు ఉన్నారా..? ఈ విషయంలో జరుగుతున్న ప్రచారం వెనుక వాస్తవమెంతో తెలియాలంటే రోజులు కాదు.. మరికొద్ది గంటలు ఆగితే చాలు.

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here