నా పెళ్లి టాపిక్ ఎత్తకు పెదనాన్న : ప్రభాస్
on Feb 1, 2019
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఈ పేరు వినగానే మనకి బాగా గుర్తొచ్చేవి రెండే. ఒకటి బాహుబలి, రెండు పెళ్లి. ప్రభాస్ మీడియా కంట పడితే 'మీ సినిమా రిలీజ్ ఎప్పుడు?' అని అడిగేవారు కంటే.. 'మీ పెళ్లి ఎప్పుడు?' అని అడిగేవారే ఎక్కువ. బాహుబలి మొదలవ్వడానికి ముందు.. బాహుబలి తరువాత ప్రభాస్ పెళ్లి అన్నారు. బాహుబలి రిలీజ్ అయింది. ప్రభాస్ కి బోలెడంత క్రేజ్ వచ్చింది. కానీ పెళ్లి మాత్రం జరగలేదు. ఇంతలో సాహూ సినిమా మొదలైంది. సాహూ తరువాత ప్రభాస్ పెళ్లి అన్నారు. సాహూ రిలీజ్ టైం కూడా దగ్గరికొస్తుంది. కానీ ఇంతవరకు ప్రభాస్ పెళ్లి గురించి స్పష్టత లేదు. దీంతో మీడియా, జనాలు.. ప్రభాస్ కనిపిస్తే చాలు పెళ్లి ఎప్పుడని అడుగుతున్నారు. అయితే ప్రభాస్ పెళ్లి గురించి.. ప్రభాస్ కంటే, ప్రభాస్ పెదనాన్న రెబెల్ స్టార్ కృష్ణం రాజుకి ఎక్కువ ప్రశ్నలు ఎదురయ్యాయని చెప్పాలి. ఎందుకంటే ఆయన మీడియాకి ఎక్కువ అందుబాటులో ఉంటారు. గతంలో బాహుబలి తరువాత, సాహూ తరువాత అని కూడా ఆయనే చెప్పారు. మీడియాలో ప్రభాస్ పెళ్లి గురించి వార్తలు రావడం.. కృష్ణంరాజు మీడియా ముందుకొచ్చి సమాధానం చెప్పడం. గత కొద్ది సంవత్సరాలుగా ఇది కామన్ అయిపోయింది. విని విని ఆడియన్స్ కి బోర్ కొట్టలేదు కానీ ప్రభాస్ కి మాత్రం విసుగొచ్చింది అంట. ఇకపై మీడియాలో తన పెళ్లి గురించి ఎలాంటి కామెంట్స్ చేయకూడదని పెదనాన్న కృష్ణంరాజుకి చెప్పాడట. తన సినిమాలకు సంబంధించి వార్తల్లో ఉండాలే కానీ ఇలా వ్యక్తిగత విషయాలతో కాదని కాస్త గట్టిగా చెప్పినట్లు సమాచారం. దీన్నిబట్టి చూస్తుంటే సాహూ తరువాత కూడా ప్రభాస్ పెళ్లి కష్టమే అనిపిస్తోంది. చూద్దాం మరి ప్రభాస్ పెళ్లి న్యూస్ ఎప్పుడు చెప్తారో ఏంటో.