బ్యాంకాక్‌కు దిల్‌రాజు మనుషులు!
on Feb 1, 2019

అవును... దిల్‌రాజు మనుషులు బ్యాంకాక్ వెళ్తున్నారు. వెళ్తున్నది స్టోరీ డిస్కషన్లకు కాదు... ఎంజాయ్ చేయడానికి! మీరు చదివింది నిజమే! సాధారణంగా దర్శకుడు పూరి జగన్నాథ్ తదితరులు సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి ముందు స్టోరీ డిస్కషన్లకు, స్టోరీ రాయడానికి బ్యాంకాక్ వెళ్తుంటారు. ఇక్కడ సీన్ రివర్స్. సినిమా విడుదల తరవాత తన మనుషులను బ్యాంకాక్ పంపిస్తున్నారు దిల్ రాజు. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా దిల్ రాజు నిర్మించిన 'ఎఫ్ 2' భారీ విజయం సాధించింది. ఈ సినిమాకు కష్టపడిన తన సంస్థలో ఉద్యోగులకు దిల్ రాజు భారీ నజరానా ప్రకటించారు. బ్యాంకాక్ టూర్ ఖర్చులను ఆయనే భరిస్తున్నారు. సుమారు 20 మంది టూర్ కి వెళ్తున్నారట. వీళ్ళందరికి ఓ 25 లక్షలు ఖర్చు అవుతుందట. ఈ సినిమా మీద దిల్ రాజుకు ఎలా లేదన్నా ఓ 30, 40 కోట్లు మిగిలే అవకాశం కనిపిస్తుంది. ఆ లాభంతో పోల్చుకుంరంటే బ్యాంకాక్ ఖర్చు పెద్ద విషయం కాదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



