రావణబ్రహ్మగా బాలకృష్ణ...
on Dec 20, 2018
ఎన్టీఆర్ బయోపిక్ టీమ్ ఇప్పటివరకూ విడుదల చేసిన స్టిల్స్ అన్నీ ఒక ఎత్తు అయితే... రావణబ్రహ్మ గెటప్‌లో విడుదల చేసిన బాలకృష్ణ చేసిన స్టిల్ మరో ఎత్తు. సినిమాలో స్టార్కాస్ట్ అందర్నీ ఈ పోస్టర్లో పొందుపరిచారు. అయితే... పోస్టర్లో రావణబ్రహ్మగా నిలువెత్తు బాలకృష్ణ రూపమే, నిండైన విగ్రహమే ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. ఈ పోస్టర్ ఇలా ఉంటే... శుక్రవారం విడుదల చేయబోయే ట్రైలర్ ఎలా ఉంటుందో? పాటలు ఎలా ఉంటాయో? అని ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్‌గా బాలకృష్ణ ఆహార్యం అద్భుతమని నందమూరి అభిమానులు మురిసిపోతున్నారు. రాధాకృష్ణ జాగర్లమూడి (క్రిష్) దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. మరికొన్ని గంటల్లో... శుక్రవారం సినిమా పాటలు, ట్రైలర్ విడుదల చేయనున్నారు. హైదరాబాద్‌లోని జె.ఆర్.సి. కన్వెషన్ సెంటర్ ఆడియో విడుదల కార్యక్రమానికి ముస్తాబు అవుతుంది. నందమూరి కుటుంబ సభ్యులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ నెల 16న హైదరాబాద్ లో ట్రైలర్ విడుదల చేసి, 21న నిమ్మకూరులో పాటల్ని విడుదల చేయాలనుకున్నారు. తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి ఓటమి నేపథ్యంలో ట్రైలర్ విడుదల కార్యక్రమం రద్దు చేసి, 21న ఆడియో విడుదల కార్యక్రమానన్ని హైదరాబాద్ కి షిఫ్ట్ చేశారని ఫిలింనగర్ గుసగుస. ఓటమి తరవాత వెంటనే ట్రైలర్ విడుదల కార్యక్రమం చేయడం ఇష్టం లేక వాయిదా వేశారట.