విశాల్‌పై తమిళ నిర్మాతల ఆగ్రహం
on Dec 20, 2018
నటుడు, నిర్మాత విశాల్‌పై తమిళ నిర్మాతల ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణాది నటీనటుల సంఘం (నడిఘర్ సంఘం) కమిటీ సభ్యుడిగా తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడిగా తమిళ చిత్ర పరిశ్రమలో విశాల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. చిత్ర పరిశ్రమ తీసుకునే పలు నిర్ణయాల్లో విశాల్ మాట కీలకంగా మారుతుంది. విశాల్ మాటే చెల్లుబాటు అవుతుంది. నడిఘర్ సంఘం ఎన్నికల్లో, నిర్మాతల మండలి ఎన్నికల్లో విశాల్ పలు హామీలు ఇచ్చారు. అవి నెరవేర్చకుండా స్వలాభంతో ఆయన పని చేస్తున్నారని తమిళ నిర్మాతలు కొందరు బుధవారం సంస్థ కార్యాలయంలో గొడవ చేశారు. క్యూబ్ ఛార్జీలు తగ్గించాలని చేసిన సమ్మె వల్ల ఉపయోగం లేకపోగా.. సినిమాల విడుదలను క్రమబద్ధీకరించడం కోసం ఏర్పాటు చేసిన కమిటీ పక్షపాతంగా వ్యవహరిస్తుందని కొందరు నిర్మాతలు ఆరోపణలు చేశారు. నిర్మాతల మండలి కార్యాలయంలో విశాల్ లేని సమయంలో వచ్చి గొడవకు దిగారు. చివరకు, సంస్థ కార్యాలయానికి తాళం వేసి పోలీస్ స్టేషనులో అప్పగించారు. వీటిపై విశాల్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.