70 ఏళ్ల బామ్మ పాత్రలో సమంత..!!
on Aug 24, 2018
'ఏ మాయ చేసావె' సినిమాతో వెండితెరకు పరిచయమైన సమంత మొదటి సినిమాతోనే ప్రేక్షకులతో పాటు నాగ చైతన్యను మాయ చేసింది.. విభిన్న సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సమంత.. తరువాత నాగ చైతన్యను వివాహం చేసుకుంది.. అయితే వివాహం అనంతరం సమంత సినిమాలు మానేస్తుందని ప్రేక్షకులు భావించారు.. కానీ వివాహం తరువాత కూడా సినిమాలు చేస్తూ అలరిస్తోంది సమంత.. ప్రస్తుతం సమంత నటించిన 'యూ టర్న్' సినిమా విడుదలకు సిద్ధమైంది.. ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.. మరోవైపు సమంత తన తరువాతి సినిమాలో 70 ఏళ్ల బామ్మ పాత్ర చేయబోతున్నట్టు తెలుస్తోంది.
దక్షిణ కొరియాలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ‘మిస్ గ్రానీ’ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నట్లు కొంతకాలంగా వార్తలు వెలువడుతున్నాయి.. ఇందులో సమంత ప్రధాన పాత్రలో నటించనున్నట్లు సమాచారం.. ఈ సినిమాకు ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది.. సురేశ్‌బాబు ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించనున్నట్లు సమాచారం.. దక్షిణ కొరియాకు చెందిన వాంగ్ డాంగ్ హ్యుక్ ‘మిస్ గ్రానీ’ సినిమాను తెరకెక్కించారు.. ఇదో కామెడీ డ్రామా చిత్రం.. 2014లో విడుదలైంది.. ఓ 70 ఏళ్ల వృద్ధురాలు స్టూడియోలో ఫొటో తీయించుకుంటుంది.. ఆ ఫొటో దిగిన కొన్ని రోజుల తర్వాత అచ్చం తనలాగే ఉన్న యువతి కనపడుతుంది.. ఆ యువతిని చూసి బామ్మ షాకవుతుంది.. ఆ తర్వాత ఏం జరుగుతుంది? అన్నదే ఈ సినిమా కథ.. మరి ఈ వార్త నిజమైతే త్వరలోనే మనం సమంతను బామ్మ పాత్రలో చూస్తామన్నమాట.