తమన్నాపై చెప్పుతో దాడి! అందుకే దాడి చేశా!
on Jan 29, 2018
అభిమానుల చేష్టలు స్టార్స్ ని ఇరిటేట్ చేయడం కామనే. అయితే... ఒక్కోసారి వాళ్లు మరీ అమాయకంగా ప్రవర్తిస్తుంటారు. ఆ చేష్టల్ని చూసి స్టార్స్ కి బాధ పడాలో... ఆనందించాలో అర్థంకాని పరిస్థితి. ఆదివారం మిల్కీబ్యూటీ తమన్నాకి కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది.
పాపం.. హైదరాబాద్ లోని ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఫంక్షన్ కి అతిథిగా వెళ్లింది తమన్నా. షోరూమ్ ని ప్రారంభిస్తున్న సమయంలో... ఉన్నట్టుండి... అమాంతం ఓ చెప్పు ఎగిరొచ్చి తమన్నాపై పడబోయింది. అయితే... మిల్కీ బ్యూటీ తప్పుకోవడంతో ఆ చెప్పు కాస్త దూరంలో పడింది.
తమన్నాపై చెప్పుతో దాడి జరిగే సరికి.. అక్కడి వాతావరణం ఒక్కసారి వేడెక్కిపోయింది. మార్షల్స్ అలెర్ట్ అయిపోయారు. చెప్పు విసిరిన వ్యక్తి పట్టుకొని దేహ శుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఆ కుర్రాడి పేరు కరీముల్లా అని విచారణలో తేలింది. ఇంతకీ తమన్నాపై కరీముల్లా ఎందుకు చెప్పుతో దాడి చేశాడు.? ఈ విషయంపై విచారణ జరపగా.. పోలీసులకు ఆసక్తికమైన జవాబులిచ్చాడు కరీముల్లా.
తాను తమన్నాకు వీరాభిమానిననీ... ఈ మధ్యకాలంలో తమన్నా సరైన సినిమాలు చేయడం లేదనీ... ఐటంమ్ సాంగులు చేస్తోందనీ... అది నచ్చకే చెప్పులతో దాటికి తెగబడ్డాననీ.. చెప్పాడంట కరీముల్లా.