పుండు మీద కారం పెట్టడం అంటే ఇదే
on Jul 6, 2017
ఎప్పుడైతే తన గురించీ, కెరీర్ గురించీ కాకుండా... సంబంధం లేని విషయాల గురించి రామ్ గోపాల్ వర్మ ఆలోచించడం మొదలుపెట్టాడో... అక్కడ్నుంచే ఆయన డౌన్ ఫాల్ మొదలైందనేది పలువురి అభిప్రాయం. సోషల్ మీడియా సాక్షిగా ఆయన ఇచ్చే స్టేట్మెంట్లే కాదు.. ఆయన ప్రవర్తన కుడా హర్షించదగిందిగా ఉండటం లేదని పలువురి అభిప్రాయం కూడా. ముఖ్యంగా స్త్రీల విషయంలో వర్మ అభిమతం నిజంగా అభ్యంతరకరం. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే... మహిళలను ఆడపడుచులుగా భావించి, స్త్రీల కోసం ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టి... తెలుగు మహిళల చేత ‘అన్న’గా ఆరాధింపబడ్డ నందమూరి తారక రామారావు కథను... వర్మ సినిమాగా తీస్తాననడం చాలా ఇబ్బంది కరంగా ఉందని పలువురు వాపోతున్నారు. రెండుమూడ్రోజుల క్రితం బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తో ముంబాయ్ లోని ఓ రెస్టారెంట్ లో అనుకోకుండా వర్మ కలిశాడు. మందు తిక్కలో చేశారో, ఎందుకు చేశారో తెలీదు కానీ... ఇద్దరూ ముద్దులు పెట్టుకుంటూ సెల్ఫీలకు పోజులిచ్చేశారు. ఆ ఫొటోలను ఏకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ... ‘అనురాగ్ కశ్యప్ ముద్దు చాలామంది అమ్మాల ముద్దుల కంటే రుచిగా ఉంటుంది. అందుకని ఇదేదో శృంగారం అనుకోవద్దు. ఫ్రెండ్స్ కూడా ముద్దులు పెట్టుకోవచ్చు.
అనురాగ్ కూ, నాకూ ఓ విషయం పోలిక ఉంటుంది. అదేంటంటే... మా ఇద్దరికీ అమ్మాయిలంటే ఇష్టం. అమ్మాయిలను ద్వేషించేవారంటే మాకు అసహ్యం. ఒకవేళ మా ఇద్దరి గురించీ మీరు తప్పుగా అర్థం చేసుకున్నా ఫర్వాలేదు. ఎందుకంటే... ఎవరేమనుకున్నా మాకు ఒకరంటే ఒకరికి అంతులేని ప్రేమ ఉంది’’అని కామెంట్ పెట్టాడు. ఇది చదివిన వాళ్లందరూ వర్మపై చెప్పలేనంత ఘాటుగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీయార్ సినిమా తీస్తానని చెప్పి పుండు మీద కారం పెట్టాడు వర్మ. ఇలాంటి వ్యక్తా ఎన్టీయార్ సినిమా తీసేది? అని వాపోతున్నారు అందరూ.ఓ వైపు సెలబ్రిటీలు సైతం వర్మపై భగ్గు మంటున్నారు. నారా లోకేష్ డైరెక్ట్గ్ గా ‘అసలు వర్మతో మేం సినిమా చేయడం లేదు’ అని మీడియోతో తేల్చి చెప్పేశాడు. పోసాని కృష్ణమురళి అయితే... మహానుభావుడైన ఎన్టీయార్ కథతో ఆటలాడితే జనాలు వెంటబడి తంతారనీ, కోటి రుపాయిలు ఇచ్చినా ఆ సినిమాలో చేయనని కరాఖండీగా చెప్పేశారు. మాఫియా, రక్తపాతాల నేపథ్యాల్లో సినిమాలు తీసే వర్మ... ఎన్టీయార్ కథ తీయడం పొంతన లేని వ్యవహారమనీ... ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న ‘అన్న’కథతో సినిమా తీయాలంటే... దానికి అర్హత ఉండాలనీ,అసలు స్త్రీలను గౌరవించలేని వర్మ.. స్త్రీలను అక్క చెల్లెలుగా అరాధించి, వారితో ఆరాధింపబడ్డ ఎన్టీయార్ కథను ఎలా తెరకెక్కిస్తాడనీ లక్ష్మీపార్వతి దుయ్యబట్టారు.
అయితే... ఈ ఉదాంతం గురించి బాలకృష్ణ నుంచి మాత్రం ఒక్క స్టేట్మెంట్ కూడా రాకపోవడం విశేషం. బాలకృష్ణ ముందుగా చెప్పినట్టు ఎన్టీయార్ సినిమా ఉంటుందా? దానికి దర్శకుడు వర్మేనా? వర్మ కాకపోతే ఎవరు తీస్తారు? ఇవన్నీ ప్రస్తుతం చర్చనీయాంశాలు. వీటికి కాలమే సమాధానం చెప్పాలి.
Also Read