ముంబై బిజినెస్ మ్యాన్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతుంది
on Jul 6, 2017
యాభై పదులు దాటినా అతన్ని హీరో అనే అంటారు... అదే, ముప్పయ్యో పదిలో అడుగెట్టిందా ఆమెని అక్కో, ఆ వయసు కూడా దాటితే ఆంటీ అనో అంటారు... అందుకే వయసున్నప్పుడే నాలుగు సినిమాలు, నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి అనే మైండ్ సెట్ తో ఉంటారు హీరోయిన్లు. సినిమా ఆఫర్లు తగ్గాయా, ఏ బిజినెస్ మ్యాన్ నో డబ్బులున్న సెలబ్రిటీనో మొదట లవ్ చేసి, తర్వాత పెళ్లి చేసుకోవడం మనం అరుదుగా చూసే వ్యవహారం.
ఇక అసలు విషయానికి వస్తే, మొన్నటికి మొన్న బాలీవుడ్ దర్శకుడు మనీష్ శర్మతో చెట్టాపట్టా లేసుకొని తిరిగిన బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, అతగాడితో చెడడంతో బ్రేక్ అప్ చెప్పింది అని వార్తలు వచ్చాయి. ప్రస్తుతానికి ఒక ముంబై బిజినెస్ మ్యాన్ తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతుందని బాలీవుడ్ కోడై కూస్తుంది. ఈ మధ్య ఇద్దరూ ఎక్కడ పడితే అక్కడ చేతిలో చేయి వేసుకొని ఎవరు చూస్తే మాకేంటి అన్న ధోరణిని వ్యవహరిస్తున్నారట. అయితే, ఈ ప్రేమ పెళ్లి పీటల వరకు వెళుతుందా లేక కొన్ని రోజులకి ఇద్దరికీ మొహం మొత్తి బై బై చెప్పుకుంటారా? ఏమో చూడాలి మరి!