రానా సక్సెస్ కొట్టాడు..మరి ఎన్టీఆర్ పరిస్థితి ఏంటో..?
on Jul 4, 2017
రానా దగ్గుబాటి కెరీర్ బాహుబలి కి ముందు, బాహుబలి కి తర్వాతగా విభజించాల్సి ఉంటుంది. ఎందుకంటే, కొన్ని మంచి సినిమాలు చేసినప్పటికీ, రానా కి సరైన బ్రేక్ దొరకలేదు. రాజమౌళి ఇచ్చిన అవకాశాన్ని సరిగ్గా అందిపుచ్చుకొని, తానేంటో యావత్ భారతానికి తెలిసేలా చేసాడు. భల్లాలదేవ గా బాహుబలిలో రానా నటన ఎప్పటికీ గుర్తుండి పోతుంది. అలాంటి రానా, ఇప్పుడు నెం 1 యారి అని ఒక టీవీ రియాలిటీ షో చేస్తున్నాడు. సెలబ్రిటీ మిత్రుల్ని ఇంటర్వ్యూ చేయడంతో పాటు, వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ఎవరికీ తెలియని విషయాలు అడిగి, ప్రేక్షకులకి అందిస్తున్నాడు.
ఈ షో ప్రత్యేకత ఏంటంటే, యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే అంశాలు పుష్కలంగా ఉండడం... మరియు షో సాంతం సరదాగా సాగడం... ప్రశ్నలు రానా అడుగుతాడు కాబట్టి ఏ మాత్రం ఆలోచించకుండా సమాధానాలు చెబుతున్నారు షో కి వచ్చిన సెలెబ్రిటీలు. తాను షో బాగా ఎంజాయ్ చేసానని రాజమౌళి చెప్పగా, నాగ చైతన్య, సుమంత్ ల ఎపిసోడ్ ప్రేక్షకులకి కడుపుబ్బా నవ్వించింది. మొత్తానికి ఇది సూపర్ హిట్ షో గా అభివర్ణిస్తున్నారు. ఇకపోతే, ఇప్పుడు ఎన్టీఆర్ వంతు. బిగ్ బాస్ షో ద్వారా ఎన్టీఆర్ టీవీ ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు వచ్చిన రెండు ప్రోమోలో ఎన్టీఆర్ ఒక దాంట్లో రొమాంటిక్ గా కనిపించగా, ఇంకో దాంట్లో చలాకీగా అగుపించాడు. భారీ అంచనాలున్న ఈ షో త్వరలో మొదలవనుంది. ఎన్టీఆర్ కి మంచి వాక్చాతుర్యం ఉంది. అయితే, అది టీవీ ప్రేక్షకులని మైమరిపించడంలో ఎలా వాడుకుంటాడో చూడాలి.