ఎన్టీఆర్‌ని వర్మ చేతిలో పెట్టిన బాలకృష్ణ... దేవుడా!
on Jul 3, 2017
పూరి జగన్నాధ్ తో సినిమా చేయడమే ఒక సహోసేపేత నిర్ణయం గా భావిస్తున్న అభిమానులకి నందమూరి బాలకృష్ణ మరొక షాక్ ఇచ్చాడు. విషయం ఏంటంటే, తన తండ్రి నందమూరి తారక రామారావు జీవిత చరిత్రని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేతిలో పెట్టాడని వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ జీవితాన్ని సినిమాగా చేయడం తన కల అని ప్రకటించిన బాలకృష్ణ, ఈ సినిమాని ఒక ప్రముఖ దర్శకుడితో తీస్తానని చెప్పిన విషయం మనకి విదితమే. అయితే, ఇందూరి విష్ణు నిర్మించనున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఎవరైనా అగ్ర దర్శకుడు తీస్తాడు అని భావించిన అభిమానులకి షాకిస్తూ వర్మ పేరు పరిశీలనలో ఉందనే వార్త ఇపుడు ఫిలిం నగర్ లో హల్ చల్ చేస్తుంది.
వంగవీటి, రక్త చరిత్ర లాంటి వివాదాస్పద సినిమాలు తీసిన వర్మ ఎన్టీఆర్ జీవిత గాథ ఎలా తీయబోతున్నాడో అని అంతటా ఉత్కంఠ నెలకొంది. వర్మకి ఏ కథనయినా తనదయిన స్టయిల్లో చెప్పడం అలవాటు. సో, ఎలాంటి వివాదాలు లేకుండా అందరికీ నచ్చేలా తీస్తే ఎలాంటీ ఇబ్బందులు తలెత్తవు... లేదా వర్మ తన స్టైల్ లోనే తీస్తే, బాలకృష్ణ కల కాస్తా పీడకలగా మారే ప్రమాదం ఉంది. అయినా, ఎందరో దర్శక ధీరులుండగా బాలకృష్ణ వర్మ పేరునే ఎందుకు ప్రధానంగా పరిశీలనలో ఉంచాడు అని సగటు అభిమాని అడుగుతున్న ప్రశ్న. బోయపాటి శ్రీనివాసో లేదా ఇంకెవరయినా మాస్ పల్స్ తెల్సిన దర్శకుడో అయితే ఈ సినిమాని అత్యద్భుతంగా తీయగలరని అభిప్రాయపడుతున్నారు. మరి బాలకృష్ణ ఈ విన్నపాలు విని దర్శకుడిని మారుస్తాడా లేక ఎన్టీఆర్ జీవితాన్ని వర్మ చేతిలో పెడతాడా చూడాలి!
Also Read