పొంచివున్న 'పవన్' ప్రమాదం
on Jun 21, 2017
అల్లు అర్జున్ వెర్సెస్ పవన్ ఫ్యాన్స్ మధ్య వైరం ఇంకా కొనసాగుతూనే ఉంది. `చెప్పను బ్రదర్` అనే ఎపిసోడ్ నుంచి మొదలైన ఈ సమస్య.. ఇప్పటికీ కొనసాగుతుండడం అల్లు అర్జున్‌ని ఇబ్బంది పెడుతోంది. `డీజే` టీజర్ కి వచ్చిన డిజ్ లైక్స్‌ని, కింద వచ్చిన కామెంట్లనీ చూస్తే... పవన్ ఫ్యాన్స్ బన్నీపై ఎంత గుర్రుగా ఉన్నారో అర్థం అవుతుంది. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ డీజేపై పడబోతోందన్నది ఇండ్రస్ట్రీ వర్గాల మాట. మెగా ఫ్యాన్స్‌లో ఎక్కువ వాటా.. పవన్ ఫ్యాన్స్ దే. మెగా కుటుంబం నుంచి ఏ హీరో సినిమా చేసినా... వీళ్ల అండ దండలు ఉండాల్సిందే. బన్నినీ వాళ్లు ముందు నుంచీ సమర్థిస్తూనే వచ్చారు. ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ బన్నీకి దూరం అయ్యారు.
`డీజే`కి కూడా వవన్ ఫ్యాన్స్ బహిష్కరించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అంతేకాదు.... పవన్ వీరాభిమానులు `డీజే`పై నెగిటివ్ ప్రచారం చేసే అవకాశం ఉందని డీజే టీమ్ భయపడుతుతోంది. పవన్ ఫ్యాన్స్‌ని కూల్ చేసేలా అల్లు అర్జున్ ఒకట్రెండు స్టేట్ మెంట్లు ఇచ్చినా, లేదంటే డీజే ఫంక్షన్‌కి పవన్‌ని పిలిచినా.. ఈ వివాదం ఇక్కడితో సమసిపోయేది. కానీ బన్నీ అలాంటి ప్రయత్నాలేం చేయలేదు. పవన్ ఫ్యాన్స్ కోపం కూడా తీరలేదు. ఆ ఎఫెక్ట్ డీజేపై పడడం ఖాయమనే అనిపిస్తోంది. ఎంత వరకూ అనేది తెలియాలంటే మాత్రం డీజే విడుదలయ్యేంత వరకూ ఆగాల్సిందే.