బాలీవుడ్లో 3 సినిమాలకి 150 కోట్లు తీసుకుంటున్న ప్రభాస్
on Jun 21, 2017
డైరెక్టర్ రోహిత్ శెట్టి దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ మరో హీరోగా చేస్తున్న సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ లో కాలు పెట్టనున్నాడని మొన్నా మధ్య వార్తలొచ్చాయి. అయితే, ఈ రూమర్స్ ని దర్శకుడు రోహిత్ శెట్టి ఖండించాడు. తాను అసలు ప్రభాస్ ని కలవలేదని... తన తర్వాతి చిత్రంలో ప్రభాస్ ఉంటాడని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని చెప్పాడు. ఇదిలా ఉంటే, ప్రభాస్, కరణ్ జోహార్ తో మూడు సినిమాలకి డీల్ కుదుర్చుకున్నాడని తెలిసింది. బాహుబలి సిరీస్ తో లాభాల పంట పండించుకున్న కరణ్, ప్రభాస్ ని బాలీవుడ్ లో తన సంస్థ ద్వారా పరిచయం చేసేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం, మంచి కథలు, వాటిని డీల్ చేసే దర్శకుల కోసం వేచి చూస్తున్నాడు.
ఇంతకీ, కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ సంస్థలో చేయనున్న 3 సినిమాలకి గాను, ప్రభాస్ పారితోషికం ఎంతో తెలుసా? అక్షరాలా 150 కోట్లు... అంటే ఒక సినిమాకి 50 కోట్లు తీసుకుంటున్నాడన్నమాట. ఇది దాదాపు, బాలీవుడ్ అగ్ర హీరోల రెమ్యూనరేషన్ కి సరి సమానం. అన్నీ కుదిరితే, మొదటి సినిమా వచ్చే సంవత్సరం చివర్లో కానీ, లేదంటే 2018 ప్రథమార్థంలో కానీ మొదలవ్వొచ్చు. ప్రస్తుతం, ప్రభాస్ సాహూ సినిమా షూటింగ్ తో బిజీ గా ఉన్నాడు.