ఫ్యాన్స్ తో బాలయ్య అరాచకం
on Jun 21, 2017

అభిమానులే మా ప్రాణం అని చెబుతుంటారు కథానాయకులు. నిజమే.. ఫ్యాన్స్ లేకపోతే... హీరోలు లేరు. వాళ్లకంత ఇమేజీ లేదు. కాకపోతే.. కొన్నిసార్లు ఫ్యాన్స్ తో హీరోలకు ఇబ్బంది తప్పదు. ఫొటోలూ, సెల్ఫీలూ అంటూ కంగాళీ చేస్తుంటారు. హీరోలు పెద్ద మనసుతో వాటిని ఓర్చేసుకొంటుంటారు. కాకపోతే... బాలయ్య దగ్గర ఇలాంటి పప్పులేం ఉడకవు. మనసులో ఉన్నది ఉన్నట్టుగానే ఎలాంటి ఫిల్టర్ లేకుండా బయటకు వచ్చేస్తుంటుంది. ఫ్యాన్స్ దగ్గరా అంతే. బాలయ్య - వాళ్ల ఫ్యాన్స్‌తో ఫొటోలు దిగుతున్న లేటెస్ట్ వీడియో ఒకటి.. నెట్ ప్రపంచంలో హల్ చల్ చేస్తోంది. పళ్లు రాల గొట్టాలా - మీతోనే వచ్చాడా.. పక్కకు తోసేయండి - ఇలాంటి డైలాగులు బాలయ్య నోటి నుంచి అలవోకగా వచ్చేశాయి.
ఫ్యాన్స్ అంటూ చెప్పుకొని తన పక్కకు వచ్చిన వాళ్లని కూడా బాలయ్య పక్కకు తోసేయడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఫ్యాన్సంటే హీరోల బలం. కాకపోతే అప్పుడప్పుడూ వాళ్లే బలహీనత అవుతారు. తమ బలహీనతల్ని ఇలా ఎత్తి చూపిస్తారు. మొత్తానికి ఈ వీడియో... బాలయ్య అభిమానులనే కాదు.. అందరినీ ఆకట్టుకొంటోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



