ట్రైలర్ రివ్యూ: బాహుబలి-2
on Mar 13, 2017
టాలీవుడ్‌తో పాటు ప్రపంచం మొత్తం ఉత్కంఠతో ఎదురుచూస్తున్న బాహుబలి-2కి మరింత హైప్ తెచ్చేందుకు దర్శకధీరుడు రాజమౌళి పక్కా వ్యూహంతో ముందుకెళుతున్నాడు. నిన్న మొన్నటి వరకు కామ్‌గా ఉన్న జక్కన్న పోస్టర్స్, మోషన్ పోస్టర్స్ అంటూ హడావిడి చేస్తున్నాడు. ముఖ్యంగా ఈ మూవీలో యుద్ద సన్నివేశాలతో పాటు క్లైమాక్స్ ఓ రేంజ్లో ఉంటాయని ముందు నుంచి చెప్పుకొస్తున్నాడు రాజమౌళి.
అందుకు తగ్గట్టుగానే ఇవాళ "స్నీక్ పీక్" ఒకటి రిలీజ్ చేశాడు జక్కన్న. ఇందులో రక్తమోడుతున్న ప్రభాస్ తన రక్తంతో శివలింగాన్ని అభిషేకిస్తున్నట్లుగా ఉంది. చూస్తుంటే బాహుబలి-2ని కీలకమలుపు తిప్పే సన్నివేశంలా ఉంది. అయితే ప్రభాస్ మొహం కేవలం సగమే కనిపిస్తుంది..ఇది ఇలా రిలీజ్ అయ్యిందో లేదో అప్పుడే సోషల్ మీడియాలో టాప్‌లో ట్రెండింగ్ అవుతోంది. ఫ్యాన్స్ దీనిని షేర్ చేస్తూ ఆన్లైన్లో డిష్కసన్ పెట్టేశారు. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని ఏప్రిల్ 28న రిలీజ్ చేయనున్నారు.