హీరోయిన్ని గర్భవతిని చేసిన కేటుగాడు
on Mar 13, 2017
సాధారణంగా ప్రేమ పేరుతో అమ్మాయిల వెంటపడి వారికి మాయ మాటలు చెప్పి వారిని అన్ని రకాలుగా వాడుకునే మగాళ్లను చూశాం. అయితే ఏకంగా హీరోయిన్నే ప్రేమ పేరుతో నమ్మించి ఆమెను గర్భవతిని చేశాడు ఓ కేటుగాడు. తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా ఇప్పుడిప్పుడే అవకాశాలు తెచ్చుకుంటున్న ఓ వర్థమాన నటికి యశ్వంత్ కుమార్ అనే బీటెక్ విద్యార్థితో ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ముదిరిపాకాన పడి చివరికి ప్రేమగా మారింది. ఇద్దరు కలిసి హైదరాబాద్ రహమత్‌నగర్‌లోని ఒకే ఇంట్లో సహజీవనం చేసే వరకు విషయం వెళ్లింది.
అయితే శారీరకంగా ఆమెకు దగ్గరయ్యేందుకు గత డిసెంబర్ 2న పసుపుతాడు కట్టి పెళ్లి చేసుకున్నాడు. పెద్దల సమక్షంలో తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అయితే ఇటీవల నటి గర్భం దాల్చడంతో యశ్వంత్ ఆమెకు అబార్షన్ చేయించాడు..తనను చట్టబద్దంగా పెళ్లి చేసుకోవాలని హీరోయిన్ ఒత్తిడి తేవడంతో తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని తేల్చిచెప్పాడు. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు యశ్వంత్‌ను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ వార్త ఫిలింనగర్లో చర్చనీయాంశమైంది.