మలయాళ దర్శకుడు దిఫన్ చేతన్ కన్నుమూత
on Mar 13, 2017
హీరోయిన్ భావన కిడ్నాప్ ఘటన కళ్లముందు ఉండగానే మలయాళ చిత్ర పరిశ్రమకు మరో షాక్ తగిలింది. యంగ్, టాలెంటెడ్ డైరెక్టర్ దిఫన్ చేతన్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చేతన్ తుదిశ్వాస విడిచారు. అసిస్టెంట్ దర్శకుడిగా కెరిర్ మొదలు పెట్టిన ఆయన 2003లో "లీడర్ కింగ్ మేకర్" మూవీతో ఫుల్ టైం డైరెక్టర్గా మారారు. అనంతరం దాదాపు ఆరు సంవత్సరాల పాటు దర్శకత్వానికి దూరంగా ఉన్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత 2009లో పృథ్వీరాజ్ నటించిన పుతియా ముఖం సినిమాకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత 2012లో హీరో, సిమ్, 2014లో సురేష్ గోపితో డాల్ఫిన్ బార్ సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన మృతిపట్ల పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలిపారు.