వంగవీటి-2 వస్తోంది..దర్శకుడు వర్మ కాదు
on Dec 30, 2016
దివంగత నేత వంగవీటి మోహనరంగా జీవిత చరిత్రతో పాటు బెజవాడ రౌడీ రాజకీయాల నేపథ్యంతో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తీసిన వంగవీటి సినిమా అనుకున్నట్లుగానే ప్రకంపనలు సృష్టిస్తోంది. రంగా చరిత్రను వక్రీకరించారని..వాస్తవాలను దాచిపెట్టారని వర్మపై రంగా తనయుడు రాధా ఫైరయ్యారు. డబ్బులు కావాలంటే చందాలు వసూలు చేసి మొహన కొట్టేవాళ్లమంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీనిపై స్పందించిన వర్మ నేను తీసిన తప్పయితే అసలు వంగవీటి ఎంటో తీసి చూపించాలని రాధాకు సవాల్ విసిరాడు. అయితే వర్మ సవాలును రాధాకృష్ణ అంత సీరియస్గా తీసుకోలేదు. కానీ నటుడు, దర్శకుడు జీవీ సుధాకర్ నాయుడు మాత్రం రీయాక్ట్ అయ్యారు. రంగా ప్రజలకు ఏం చేశారో ప్రేక్షకులకు తెలియపరుస్తానని వచ్చే ఏడాది ఇదే సమయానికి నిజమైన వంగవీటి చరిత్రను అందిస్తానని జీవీ అన్నారు. మరి ఈ ప్రాజెక్ట్ ఎంత వరకు పట్టాలెక్కుతుందో వేచి చూడాలి.