Home

»

Latest News

శాతకర్ణిలో సర్‌ప్రైజ్‌..!

Dec 30, 2016

నటసింహం నందమూరి బాలకృష్ణ 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణిపై అభిమానుల్లో ఎన్నో అంచనాలున్నాయి. దీనికి తోడు ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచేసింది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఫిలింనగర్‌ చక్కర్లు కొడుతోంది. బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ శాతకర్ణితో ఎంట్రీ ఇవ్వబోతున్నారట. దీనికి సంబంధించి గతంలోనే వార్తలు వచ్చినప్పటికి బాలయ్యతో సహా చిత్రయూనిట్ ఆ వార్తలను ఖండించలేదు. మోక్షజ్ఞ ఈ సినిమాలో ఓ కీ రోల్‌లో నటించాడట. కథను మలుపు తిప్పే స్థాయిలో ఆ పాత్ర ఉండబోతోందట. అయితే దీనిపై ఎలాంటి అఫిషియల్ ఎనౌన్స్‌మెంట్ లేదు..ఒకవేళ ఇది నిజమైతే నందమూరి ఫ్యాన్స్‌కు నిజంగా పండుగే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com