శర్వానంద్ "మహానుభావుడు"
on Dec 20, 2016
యంగ్ హీరోల్లో కాస్త నిదానంగా సినిమాలు చేస్తూ కూల్ హిట్ కొట్టే హీరోగా శర్వానంద్‌కు మంచి పేరు ఉంది. వేగంగా సినిమాలు చేయడం కన్నా ఆలస్యమైనా మంచి కథను ఎంచుకోవాలనే ఆలోచనతోనే ఆయన కనిపిస్తాడు. అందుకే హిట్ పర్సెంటెజ్ శర్వానంద్‌కు ఎక్కువ. శర్వా ప్రస్తుతం సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో శతమానం భవతి సినిమా చేస్తున్నాడు సంక్రాంతి కానుకగా ఈ మూవీ విడుదలకానుంది. ఇది చేస్తూనే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు ఎక్స్‌ప్రెస్ రాజా. డైరెక్టర్ మారుతి చెప్పిన కథ నచ్చడంతో వెంటనే పచ్చజెండా ఊపేశాడు. తాజాగా దీనికి "మహానుభావుడు" అన్న టైటిల్‌ను కన్ఫర్మ్ చేసినట్లు ఫిలింనగర్ టాక్. యూవీ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించనుంది.