కరీనాకు పండంటి మగబిడ్డ
on Dec 20, 2016
బాలీవుడ్ స్టార్ కపుల్స్ కరీనా కపూర్-సైఫ్ అలీఖాన్‌కు మగబిడ్డ పుట్టాడు. ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో కరీనా పండంటి బాబుకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సైఫ్ మీడియాకు తెలియజేశారు. బాబుకు తైమూర్ అలీఖాన్ పటౌడి అని పేరు పెట్టామని..ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. గత తొమ్మిది నెలలుగా తమపై ఎంతో ప్రేమ చూపి ఆశీర్వదించినందుకు సన్నిహితులు, అభిమానులు, మీడియాకు సైఫ్, కరీనా కృతజ్ఞతలు తెలిపారు. విషయం తెలుసుకున్న బాలీవుడ్ ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా సైఫ్ దంపతులకు అభినందనలు తెలియజేశారు.